తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చూపు జగన్ మీదనే ఉంది. జగన్ ముఖ్యమంత్రి ఈ రెండింటినీ కలిపి చదవలేకపోతున్నారు. జగన్ ఆరు నెలలుగా సీఎం సీట్లో కూర్చున్నా కూడా బాబుకు నమ్మకం కుదరడంలేదు. దాంతో ఏదో విధంగా బురద జల్లి అయినా జగన్ని బదనాం చేయాలని బాబు ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ లోగా మరో వైపు  పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.


పార్టీ తన వెంట వస్తోందా లేదా అన్న ఆలోచన బాబు పెద్దగా  చేస్తున్నట్లుగా కనిపించడంలేదు. తనతో పాటు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వారంతా ఎందుకు సైలెంట్ గా  ఉన్నారో బాబు తర్కించి చూడడంలేదు.  పార్టీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలన్న ఆలోచన ఆయన చేస్తున్నా అది అసలు పార్టీ నాయకులకు ఎంతవరకు సమ్మతిగా ఉందన్నది కూడా బాబు బేరీజు వేసుకున్నట్లుగా కనిపించడంలేదు. ఇక చంద్రబాబు ఇసుకను పట్టుకుని బంగారం చేద్దామనుకుంటున్నారు కానీ ఈలోగా బంగారం లాంటి ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోతున్నారు. ఒక ఎమ్మెల్యే ఇప్పటికే రాజీనామా చేసేశాడు, మరో ఎమ్మెల్యే ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరుతుపుతున్నాడు, ఇక బీజేపీ నాయకులేమో పెద్ద సంఖ్యలో టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ వైపునకు వస్తారని అంటున్నారు.

అదే జరిగితే టీడీపీ కొంప కొల్లేరు అవుతుంది. మరి బాబు ఇవన్నీ చూస్తున్నారా ఇసుక మాఫియా అంటూ వైసీపీ సర్కార్ మీద ఆడిపోసుకోవడానికే సమయం మొత్తం వెచ్చిస్తున్నారా అన్నది మిగిలిన వారికి అర్ధం కావడం లేదు. బాబు వంటి రాజకీయ చాణక్యుడు  ఇప్పటికైనా తలచుకుంటే పార్టీలో తమ్ముళ్ళ పోకడలకు అడ్డుకట్ట వేయగలరని అంటున్నారు. మరి బాబు పట్టించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.  మరి బాబు సమయం మించకుండా జాగ్రత్త పడితే అదే పార్టీని బతికిస్తుందని అంటున్నారు. చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: