మనిషి జీవితంలో అన్నీ పక్కాగా తెలుసుకుంటాడు. పక్కాగా ఉండాలనుకుంటాడు. కానీ జీవితంలో అన్నీ నిజాలు చెప్పాలని అన్నవారు కూడా కావాలని ఒక నిజాన్ని మాత్రం నమ్మరు. దాన్ని వీలైనంతవరకూ మరుపు పొరల్లోకి దాచేస్తారు. అదే మరణం. మనిషిని నీడలా వెంటాడేది మ్రుత్యువు. దాన్ని ఎంతగా మరచిపోదామన్నా ప్రతీ క్షణం మనిషికి ఎదురొచ్చి గుర్తు చేస్తూనే ఉంటుంది. అటువంటి మరణం ఎపుడో తెలియకపోవడమే జీవితంలో అసలైన  మ్యాజిక్.


నీవు ఫలనా రోజున చస్తావ్ అంటే ఇక ఆ మనిషి బతికున్నా నరకయాతనే. లైఫ్ కి కౌంట్ డౌన్ ఆ రోజే మొదలవుతుంది. అంతే జీవించడమే ఆ క్షణం నుంచి మానేస్తాడు. ఓ విధంగా మరణం ఎపుడో చెప్పకుండా ఉండడం దేవుడు ఈ మనిషికి ఇచ్చిన వరం అది. బిడ్డ ఎపుడు పుడతాడో కరెక్ట్ టైం కనుగొన్న మన మేధస్సు మరణాన్ని మాత్రం ఇంతవరకూ కనిపెట్టలేకపోయింది, కాబట్టే మనిషి ఇంతవరకూ హ్యాపీగా జీవిస్తున్నాడు.


ఇపుడు ఆ వరం కూడా కరిగిపోతోంది. మానవ మేధస్సు దేవుడినే శాసిస్తూ మరణాన్ని కూడా కనుగొంటోంది. ఒక మనిషి ఎపుడు చనిపోతాడో చెప్పే మేధస్సు మనిషి సొంతమవుతోంది. ఈసీజీ రిపోర్టుల ద్వారా ఆర్టిఫీషియల్ ఇంతెలిజెన్స్  ఉపయోగించి  మనిషి ఎపుడు మరణిస్తాడో చెప్పవచ్చునని  ఆధునిక శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని మీద పెన్సిల్వేనియాకు చెందిన పరిశోధకులు నాలుగు లక్షల మంది రోగులను, 1.77 మిలియన్ల ఈసీజీల రిపోర్టులను అధ్యయనం చేసి నాడీ వ్యవస్థ లక్షణాలను బట్టి మనిషి మరణం సంభవించే రోజును అంచనా వేశామని అంటున్నారు.  భవిష్యత్తులో ఈసీజీ రిపోర్టులను పరిశోధనలకు ఉపయోగించడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని అంటున్నారు. అదే కనుక జరిగితే ఇక ఏ మనిషి ఎపుడు మరణిస్తాడో చాలా సులువుగా చెప్పెయొచ్చు. 


అయితే  ముందే చెప్పుకున్నట్లుగా దీని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా  ఉంటుందని అంటున్నారు. మరణం ఎపుడో తెలుసుకుంటే ఇక మనిషి భయస్థుడు అయినా అవుతాడు, లేదా స్వార్ధపరుడు, దుర్మార్గుడు అయినా అవుతాడు.  మరి ఈ రకమైన పరిశోధనలు ఏ రకంగా సమాజానికి మేలు చేస్తాయో ఆలోచించాలని కొంతమంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: