తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు విజయవాడలో చేపట్టిన ఇసుక దీక్ష మరి కొద్ది గంటల్లో ముగియనుంది. ఇకపోతే రాష్ట్రంలో ఉన్న ఇసుక కొరత విషయంలో జగన్ పైన విపరీతంగా విరుచుకుపడిన చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న ఇసుకను వైసీపీ నేతలే మింగేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. అయితే బాబులో ఇదే సమయంలో మరొక కోణం కూడా బయటపడటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈరోజు బాబు మాట్లాడిన మాటలని బట్టి చూస్తుంటే మన మాజీ ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు చేరువయ్యేందుకు తన వంతు ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.

పవన్ కళ్యాణ్ కార్మికులు కోసం లాంగ్ మార్చ్ చేపడితే ముఖ్యమంత్రి అతనిపై వ్యక్తిగత దూషణలు చేయడం ఏమాత్రం బాగలేదని చంద్రబాబు అన్నాడు. "మేం కూడా వ్యక్తిగతంగా మీ మీద లేదా మీ కుటుంబం మీద కామెంట్ చేస్తే మీరు తట్టుకోగలరా?" అని చంద్రబాబు ప్రశ్నించారు. మేము ఏమైనా మీకు భయపడే వాళ్ళ లాగా కనిపిస్తున్నామా..., మీరు ప్రతిపక్ష నేతలను దూషించే సమయం ప్రజల కష్టాలను తీర్చడం కోసం ఉపయోగిస్తే ఎంతో బాగుంటుందని చంద్రబాబు హితవు పలికిన తీరు చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది. 

గతంలో చంద్రబాబుతో విభేదాల కారణంగా పవన్ కళ్యాణ్ తన పార్టీని పూర్తిస్థాయిలో గత ఎన్నికలకు రంగంలోకి దింపిన సంగతి అందరికి తెలిసిందే. జనసేన ఒక్క సీటు తో మరియు టిడిపి 23 సీట్లతో ప్రతిపక్షంలో ఉన్న ఈ సమయంలో ఇద్దరూ కాకుండా కలిసి మూకుమ్మడిగా అధికార పక్షంపై దండెత్తారు అని మొదటి నుంచి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు విజయవాడలో చంద్రబాబు అన్న మాటలు వాటిని ధ్రువపరిచినట్లు కొందరు ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా జనసేన విశాఖపట్నంలో నిర్వహించిన లాంగ్ మార్చ్ కు టిడిపి నేతలు అందించిన సపోర్ట్ మరియు చంద్రబాబు చేపట్టిన దీక్షలో జనసేన చూపించిన ఆసక్తి చూస్తుంటే వారందరి అనుమానాలు నిజమనే అనిపిస్తోందా..?


మరింత సమాచారం తెలుసుకోండి: