అధికారం ఎక్కడ ఉంటే అక్కడ మన ఎమ్మెల్యేలు తిరిగడం అన్నది సర్వసాధారణమైపోయింది. ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్న టీడీపీ జగన్ పార్టీని గత ప్రభుత్వంలో ముప్పతిప్పలు పెట్టిన సంగతి విధితమే. ఇపుడు జగన్ సర్కార్ వచ్చింది. మరి జగన్ తన పార్టీకి ఏ ఒక్క ఎమ్మెల్యే అవసరం లేదని గట్టిగానే చెప్పాడు. అయినా ఎవరి ప్రయ‌త్నాల్లో వారు బిజీగా ఉన్నారట.


ఈ విషయం మీద పెద్ద బాంబే పేల్చారు టీడీపీ ఎమ్మెల్యే వంశీ. తానొక్కరినే జగన్ని కలవలేదని, చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైసీపీలోకి బంగీ జంప్ చేయాలని చక్కర్లు కొడుతున్నారని కూడా వంశీ గుట్టు బయటపెట్టాడు. దాంతో ఇపుడు టీడీపీ హై కమాండ్ కి నిద్రపట్టడంలేదుగా. ఎవరా ఎమ్మెల్యేలు అన్నది కూడా వాకబు చేసే పనిలో టీడీపీ ఉంది.అయినా ఫలితం ఏముంటుంది. గోడ దాటేసేవారు బయటకు చెబుతారా. మరి 23 మంది ఎమ్మెల్యేలలో వంశీ తొలి  అడుగు వేశాడు. టీడీపీకి 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. ఇపుడు ఎంతమంది వెళ్తారో చూడాలి. ఓ పక్క బీజేపీ సోము వీర్రాజు సైతం మరో బాంబు పేల్చారు. చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉంటున్నారని కూడా ఆయన చెప్పేశారు. తొందరలో అసెంబ్లీలోకి బీజెపీ కండువాలు ప్రవేశిస్తున్నాయని కూడా చెప్పుకొచ్చారు.


మరి ఇలా రెండు పార్టీల వైపు ఎమ్మెల్యే తమ్ముళ్ళు పరిగెడుతూంటే చంద్రబాబు ప్రతిపక్ష నేత పదవి కూడా హరీమంటుందని అంటున్నారు. అది ఇంకా అవమానమే కదా. బాబు ఇప్పటివరకూ  నేను ప్రతిపక్ష నాయకున్ని అంటూనే గద్దిస్తున్నారు. నిన్న గాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఆసరాతో జగన్ని బదనాం చేయాలనుకుంటున్నారు. మరి  ఆ విపక్ష పదవి కూడా పోతే బాబు సైతం పవన్ తో పాటే ధర్నాలకు రావాలేమో కదా. మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో జగన్నాటకంలో ఎవరు ఎటువైపో తెలియడంలేదని అంటున్నారు. ఏది ఏమైనా ఆరు నెలలు తిరిగేస‌రికి వారు వీరు అవుతారంటారు. బాబు మరింతంగా అసెంబ్లీ లోపలా బయటా తగ్గిపోవడమే టీడీపీ సాధించిన విజయమనుకోవాలేమో. 


మరింత సమాచారం తెలుసుకోండి: