ఈ మధ్యకాలంలో కల్లు మనుషులే కాదు పాములు కూడా తాగుతున్నాయి. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటూ కల్లు తగిన కోతి అని. కానీ ఇప్పుడు పాములు కళ్లు తాగేస్తున్నాయి. మొన్న కూడా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో కల్లు కుండలో నాగుపాము ప్రత్యేక్షమై కలకలం సృష్టించిన సంగతి గుర్తుండే ఉంటుంది. అది మరవకముందే మరో పాము ఇలా చేసి ఆశ్చర్యపరుస్తుంది. 

                              

శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం పలాసపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈతచెట్టుకు కట్టి ఉన్న కల్లు కుండలో నాగుపాము కల్లు తాగడాన్ని గ్రామస్తులు గుర్తించారు. ఈ ఘటన చూడ్డానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పాము కల్లు తాగడం చూసి గ్రామస్థులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు అన్ని తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. 

                      

దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చుసిన నెటిజన్లలో మందు బాబులు ఫోటోలపై కామెంట్లు ఓ రేంజ్ లో గుప్పిస్తున్నారు. కోతులకు, పాములకు కూడా కల్లు అంటే ఇష్టం.. అవే అంతగా తాగేప్పుడు మేము తాగితే తప్పేంటి అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తున్నారు. మరికొందరు కామెంట్ చేస్తూ పాములు పాలు, నీళ్లే కాదు కల్లు కూడా తాగుతాయి బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా పాము కల్లు తాగటం ఆశ్చర్యమైన, అరుదైన ఘటన అనే చెప్పాలి.   

                              


మరింత సమాచారం తెలుసుకోండి: