గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబునాయుడు విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎంఎల్ఏ పదవికి కూడా వల్లభనేని వంశీ రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే.  అయితే ఆ రాజీనామా పత్రాన్ని చంద్రబాబు స్పీకర్ కు పంపకుండా తన దగ్గరే అట్టే పెట్టుకున్నారు. సరే తర్వాత అనేక పరిణామాలు జరిగాయి.

 

తాజాగా అంటే శుక్రవారం పార్టీలోని ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు గన్నవరం ఎంఎల్ఏను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిసైడ్ చేశారు.  చంద్రబాబు నిర్ణయంతో సమావేశంలో ఉన్న కొందరు నేతలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇప్పటికే పార్టీతో పాటు ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేశారు కదా ? రాజీనామా చేసిన ఎంఎల్ఏని పార్టీ నుండి సస్పెండ్ చేయటమేంటి ?

 

అసలు మీరు నాయకుడే కాదని, ప్రతిపక్షనేతగా ఫెయిలయ్యారని ఒకవైపు వంశీ మీడియాలోనే ప్రకటిస్తే ఇంకా వంశీకి షోకాజ్ నోటిసు ఇవ్వాలని నిర్ణయించటమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. వంశీ టిడిపిలో కంటిన్యు అవ్వాలని అనుకోవటం లేదు. అలాగే ఎంఎల్ఏని పార్టీలో ఉంచుకోవాలని చంద్రబాబు కూడా అనుకోవటం లేదు. మరలాంటపుడు తన దగ్గరున్న ఎంఎల్ఏ రాజీనామా లేఖను చంద్రబాబు స్పీకర్ కు పంపేస్తే సరిపోతుంది కదా ?

 

ఆ తర్వాత జరగబోయే పరిణామాలను స్పీకర్, వంశీ చూసుకుంటారు. జరిగే పనిని వదిలేసి ఇంకా షోకాజ్ నోటిసని, సస్పెన్షన్ అని చంద్రబాబు ఎందుకు లాగుతున్నారో అర్ధం కావటం లేదు. ఏదేమైనా ఒకసారి పార్టీలో ఉండదలచుకోని ఎంఎల్ఏలను, నేతలను ఎవరు కూడా పార్టీలో ఎక్కువ రోజులు ఉంచుకోలేరన్నది వాస్తవం. 23 మంది వైసిపి ఎంఎల్ఏలు కూడా పార్టీ ఫిరాయించలని అనుకున్నపుడు జగన్ వాళ్ళని అసలు పట్టిచుకోనే లేదు. వాళ్ళపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఓ లేఖ రాసి వదిలిపెట్టేశారు. కాబట్టి చంద్రబాబు కూడా ఇదే పని చేస్తే కాస్త పరువైనా దక్కుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: