వైఎస్ జగన్ మాట తప్పడు, మడప తిప్పడు అని అందరితో పాటే చంద్రబాబు కూడా నమ్మారు. నిండు అసెంబ్లీలో జగన్ ఇచ్చిన ఆ హామీకి ఇంతటి అనుభవశాలి, పెద్ద మనిషి  బాబు కూడా పడిపోయాడు. అందుకే కొండ అంచున నిలబడి కూడా జగన్ తో కలబడుతున్నారు. సరే జగన్ మంచి మాట చెప్పారు, దానికి తగినట్లుగా బాబు వైఖరి కూడా ఉండాలిగా. కానీ బాబు గత ఆరు నెలలుగా జగన్ని వదిలిపెట్టలేదుగా ఎక్కడా. చాన్స్ లేకపోయినా కూడా ప్రతీ రోజూ తిడుతూ రచ్చ రచ్చ చేశారు.


దాని ఫలితం ఇది అని టీడీపీలోనే వినిపిస్తున్న మాట. జగన్ కళ్ళు తెరిస్తే చాలు టీడీపీ ఖతం అంటూ వైసెపీ  మంత్రులు, ఎమ్మెల్యేలు తరచూ అన్న మాట ఇపుడు గుర్తుకువస్తోంది. నిజంగా జగన్ కన్ను తెరిచారా అని కూడా అనిపిస్తోంది. లేకపోతే టీడీపీ ఫైర్ బ్రాండ్ వల్లభనేని వంశీ ఏంటి బాబుని, లోకేష్ బాబుని అసలు గ్యాప్ లేకుండా ఒక్కటే వేసుకుంటున్నారు కదా. బాబు పుట్టు పూర్వోత్తరాలు, గుట్టుమట్టులు, గోత్రాలు  అన్నీ కూడా చెరిగిపారేస్తున్నారు. బాబుతో ఒక సయ్యాటే ఆడుకుంటున్నారు.


ఇంతలా రెచ్చిపోతున్న వల్లభనేని వంశీని అడ్డుకోవడం టీడీపీ తరం కావడం లేదు. ఆయన రెబెల్ అని అందరికీ తెలుసు. పైగా ముక్కుసూటి మనిషి అని కూడా తెలుసు.  ఇక  రాజకీయాల్లో ఎవరూ పత్తిత్తు కాదు, దాంతో అందరి జాతకాలు బయటపెడతానంటూ వంశీ హెచ్చరిస్తూండేసరికి తమ్ముళ్ళ నోళ్ళు ఒక్కసారిగా మూతపడిపోతున్నాయి. పెద్ద ట్విస్ట్ ఏంటంటే తాను ఇంతవరకూ చెప్పింది కేవలం పది శాతం మాత్రమేనని వంశీ అంటున్నారు. నన్ను డిస్టర్బ్ చేస్తే మొత్తానికి మొత్తం బయటపెడతానంటున్నారు. 


ఇక వంశీ ఒక్కరితోనే టీడీపీ మొత్తాన్ని జగన్ కామ్  గా కంపు చేసి పారేస్తున్నారు. ఏకధాటిగా బురద జల్లేస్తున్న వంశీతో టీడీపీ నానా ఇబ్బందులు పడుతోంది. ఇది వోన్లీ టీజర్ మాత్రమేనని వైసీపీ నేతలు అంటున్నారు. ఇంకా తమ వద్ద చాలా సినిమా ఉందని చెబుతున్నారు. అంటే ఎంతో మంది  ఎమ్మెల్యెలు, నాయకులు టీడీపీ నుంచి వెళ్లడానికి రెడీగా  ఉన్నారన్నమాట.  అదే కనుక జరిగితే బాబుకు విపక్ష హోదా గల్లంతు కావడమే  కాదు, టీడీపీ ఖతం అవుతుందని అంటున్నారు. మరి జగన్ మూడవ కన్ను తెరిచేశారుగా. ఇక చూస్కో ఏపీ పోలిటిక్స్ సెగలూ పొగలేనట.


మరింత సమాచారం తెలుసుకోండి: