రాజకీయాల్లో చుట్టరికాలకు పెద్దగా విలువ లేని రోజులు ఇవి. సొంత మామనే చంద్రబాబు గద్దెదించాక చరిత్ర లోతుల్లోకి వెళ్ళి ఔరంగజేబు వెన్నుపోటు  కధలు చదువుకోనవసరంలేదనే చెప్పాలి. ఇక ఒకే పార్టీలో ఉన్నా రక్తసంబంధమైనా కూడా కొట్టుకు చస్తున్న రోజులు, వేరే పార్టీలలోకి వెళ్ళి మరీ ఓడించుకుంటున్న కలికాలపు రాజకీయమిది. మరి ఇన్ని ఉదాహరణలు కళ్ళ ముందు ఉండగా  బావ కోసం బావమరిది పలకలేదు ఉలకలేదు అంటే వింతేముంది అనుకోవచ్చు.


కానీ ఆయన అలాంటి ఇలాంటి బావమరిది కాదు. బావ కళ్ళలో ఆనందం చూసే బావమరిది. మరి బావ కాళ్ళల్లో ఇపుడు వెన్నెలలు కురియడం లేదు. నిప్పులు రాలుతున్నాయి. ఇక ఏరి కోరి పిల్లను ఇచ్చిన మేనల్లుడు సొంత పార్టీ నేతల చేతనే పప్పు అనిపించుకుంటున్నారు. టీడీపీ నావ మునిగిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో అండగా  ఉండాల్సిన బావమరిది బాలయ్య ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్న డౌట్లు తమ్ముళ్ళకు వస్తున్నాయి.


బాలయ్య విషయానికి వస్తే ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. రూలర్ సినిమా షూటింగ్ క్లైమాక్స్ లో ఉంది. మరో వైపు బోయపాటి డైరెక్షన్లో కొత్త మూవీని ఆయన చేయబోతున్నారు. బాలయ్య తనకు ఓట్లేసి గెలిపించిన హిందూపురమే వెళ్ళలేదని విమర్శలు ఉన్నాయి. మరి టీడీపీ నావ మునుగుతూంటే బాలయ్య వస్తారా అన్నది సందేహమే. ఇక అప్పట్లో అధికారంలో ఉన్నపుడు  విజయవాడలో చంద్రబాబు ధర్మ పోరాట దీక్షలో బాలయ్య పాలుపంచుకుని ఎంతటి హుషార్ నింపారు, వచ్చీ రాని హిందీలో ఆయన మాట్లాడుతూ మోడీని నానా మాటలు అన్నారు కదా. సరే ఆ తరువాత మాత్రం బాలయ్య కనిపించలేదనుకోండి. ఇక బాబు మొన్న విజయవాడ నడిబొడ్డున దీక్ష చేస్తూంటే బాలయ్య అయిపూ అజా లేరు. ఆయన కూడా ఒక ఎమ్మెల్యే. మరి ఆయన రాకుండానే టీడీపీలో పరిణామాలు వేగంగా మారిపోయాయి.


పార్టీలో వల్లభనేని చిచ్చు ఒక్కసారిగా రాజుకుంది. మరో వైపు రేపో మాపో గంటా శ్రీనివాస‌రావు సైతం జంప్ అంటున్నారు. ఎంత మంది ఎమ్మెల్యేలు  టీడీపీలో ఉంటారో ఎంతమంది బయటకు వెళ్తారో తెలియక టీడీపీ కొట్టుమిట్టాడుతోంది. మరి ఈ నేపధ్యంలో పార్టీకి నేనున్నాను అంటూ  దూసుకురావాల్సిన బాలయ్య సైలెంట్ అయిపోయారు. కారణమేంటో. మరి బాలయ్యలో కూడా ఏదైనా అసంత్రుప్తి ఉందా ఏంటి, కొంపదీసి అంటున్నారంతా 


మరింత సమాచారం తెలుసుకోండి: