వల్లభనేని వంశీ ఈ పేరు చెబితే ఇపుడు టీడీపీ శిబిరం జడుసుకుంటోంది. వంశీ ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలిసిందే. ఆయనతో ఢీ కొట్టడమంటే తమ్ముళ్లకు సాధ్యపడదని కూడా తెలుసు. వంశీ పుణ్యామా అని టీడీపీ పరువు మొత్తం బజార్న పడిపోయింది. ఒక ప్లాన్ ప్రకారం వంశీ టీడీపీ తో గేమ్  ఆడారు. దానికి అపర రాజకీయ చాణక్యుడు చంద్రబాబు సైతం పడిపోయారని అంటున్నారు. ఇపుడు వంశీ ఫ్రీ బర్డ్ అయిపోయారు. ఆయన ఎలా అనుకుంటే అలా కధ మొత్తం తిప్పేయగలరు.


వంశీ తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ఇరవై రోజుల క్రితం  వాట్సప్ మెసేజ్ బాబుకు పంపారు, అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా అన్నారు. అయితే ఇది స్పీకర్  ఫార్మెట్ లో వంశీ రాయలేదు. ఇక వంశీ మొన్న  ప్రెస్ మీట్ పెట్టి టీడీపీని చెడుగుడు ఆడేశాక బాగోదని చెప్పి పార్టీ నిన్న ఆయన్ని సస్పెండ్ చేసింది. అయితే తాను రాజీనామా చేశాక సస్పెండ్ చేయడం ఏంటి  అని వంశీ ఫైర్ అవుతున్నారు. సరే రాజీనామా అన్నది ఫార్మేట్లో లేదని అప్పట్లోనే తమ్ముళ్ళు అన్నారు.


ఇదిలా ఉండగా ఇపుడు వంశీని సస్పెండ్ చేసిన టీడీపీ రాజీనామా చేయమని డిమాండ్ చేస్తోంది. వంశీ మంచి ముహూర్తం చూసుకుని చేస్తానని అంటున్నారు. అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, అయిదేళ్ళు అయినా కావచ్చు. అంటే బంతి ఇపుడు వంశీ చేతిలో ఉందన్నమాట. మరి టీడీపీ డిమాండ్ వర్కౌట్ కావాలంటే ఏం చేయాలి అంటే ఆయన్ని సస్పెండ్ చేశామని స్పీకర్ తమ్మినేని సీతారామ్  కి ఫిర్యాదు చేయాలి.


తమ్మినేనిని    లోకేష్ బాబు, ఇతర నాయకులు నానా మాటలు  ఇటీవలే అని సున్నం పెట్టుకున్నారు. పైగా ఆయన బాబు మీద పీకల మీద కోపంతో ఉన్నారు. ఇక వైసీపీ మనిషి కూడా. తమ్మినేని యాక్షన్ ఏం తీసుకుంటారిపుడు సస్పెండ్ ఐన ఎమ్మెల్యేకు విడిగా అసెంబ్లీలో చోటు కల్పిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే వంశీ కండువా మార్చలేదు. పార్టీ ఫిరాయించలేదు. ఇక ఆయన సభ్యత్వం రద్దు చేయాలని టీడీపీ స్పీకర్ ని విన్నపాలు పంపుకున్న తమ్మినేని తనకు ఉన్న విచక్షణాధికారంలో ఆయన్ని ప్రత్యేక సభ్యునిగానే గుర్తించవచ్చు.


జగన్ చెప్పిన మాట కూడా ఇక్కడ పొల్లు పోదు, ఎందుకంటే కండువాలు మారిస్తేనే సభ్యత్వం రద్దు చేయమన్నారు. సో వంశీ వేరేగా సభ్యునిగా ఉంటూనే వైసీపీకి మద్దతు ఇవ్వవచ్చు. అంటే ఇండిపెండెంట్ గా అన్న మాట. మరి ఈ విషయంలో టీడీపీ కోర్టుకు వెళ్ళినా లాభం లేదు, ఇది స్పీకర్ పరిధిలో అంశం, ఆ సంగతి వారికి కూడా బాగా తెలుసు. అంటే ఎన్నికలు లేకుండా, సభ్యత్వం పోకుండా వంశీ టీడీపీని ఇంకా ఏడిపిస్తారన్న మాట. చూడాలి మరి ఏం  జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: