ఎప్పుడైనా ఎవరైనా గుడికి వెళ్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా కూడా ఉంటుంది. కానీ రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఉన్న 'శ్రీ మెహందీపూర్ బాలాజీ దేవాలయం'లో అడుగు పెడితే కాళ్లు, చేతులు వణకడం మొదలు పెడుతాయి. గుడి గంట మెగిన గుండె దడ బాగా పెరుగుతుంది. 


ఆ ఆలయంలో ఒకటేమి ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి. భారత్ లోని మారె ఆలయంలో కనిపించని భయానక వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. అలాగని భక్తులు లేకుండా ఈ ఆలయం ఖాళీగా ఉండదు. ఎప్పుడు ఫుల్ భక్తులతో నిండి పోయి ఉంటుంది. అసలు ఈ గుడి విశిష్టత ఏంటి ? గుడి దేవుడును చూసి ఎందుకు పారిపోతారు ? అనేది అంత ఇక్కడ చదివి తెలుసుకోండి. 


ఇంకా వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఉన్న 'శ్రీ మెహందీపూర్ బాలాజీ దేవాలయం'కు భక్తులు తరలి వస్తారు. కారణం అక్కడ ఉన్న బాలాజీ దెయ్యాలను వదిలించే శక్తి అని నమ్ముతారు. ఆలా అని బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి అని అనుకునేరు. బాలాజీ అంటే హనుమంతుడి ఆలయం అది. 


అయితే హనుమంతుడు అన్ని చోట్ల ఉన్నట్టు అక్కడ ఉండడు. సాధారణ ఆలయాల్లో ఉండే హనుమంతుడి రూపంలో ఇక్కడి విగ్రహం ఉండదు. పెద్ద పెద్ద కళ్లతో కోపంగా చూస్తున్నట్టు ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూడగానే దెయ్యాలు పారిపోతాయని భక్తులు నమ్ముతారు. అలానే వారి నమ్మకం ఎప్పుడు వమ్ము కాలేదు. ఆలయం దగ్గరకు వచ్చారు అంటే చాలు దెయ్యాలు యిట్టె పారిపోతాయి.  


అందుకే ఈ ఆలయం గురించి తెలిసి దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. సాధారణ భక్తులు ఈ ఆలయంలో అడుగుపెడితే చాలా వింతైన అనుభూతి కలుగుతుంది. దుష్ట శక్తులు వారిలోని దెయ్యం వదిలించుకోడానికి ఆలయానికి తరలి వస్తారు. దేశ, విదేశాలకు చెందిన అనేక మంది శాస్త్రవేత్తలు ఈ ఆలయంపై ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ, ఎవరికీ ఈ ఆలయం వెనుక రహస్యం అంతు చిక్కలేదు.


దెయ్యం పట్టినట్టు.. వింత వింతగా ప్రవర్తించే వ్యక్తులు ఆలయానికి రాగానే సాధారణ స్థితికి చేరుకుంటారు. దీంతో కులమతాలకు అతీతంగా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. దెయ్యం పట్టిన బంధువులను ఆలయానికి తీసుకువచ్చి దెయ్యాన్ని వదిలిస్తారు. దెయ్యం పట్టిన వారి అరుపులు విన్న సమయంలో భయమేస్తుంది. 


అంతేకాదు... ఆలా దెయ్యం వదిలించుకున్న భక్తులు హనుమంతుడికి ఆరోజీ, స్వామణి, ధరకష్ట్, బుంది అనే కానుకలు ఇస్తారు. అలాగే ఆ ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదు. తీసుకెళ్తే వారికీ కీడు జరుగుతుంది అని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఆ ఆలయంకు వచ్చే భక్తులు మాంసం, మద్యం సేవించకూడదు, అయితే శనివారం, మంగళవారం మాత్రమే దెయ్యాలను వదిలించే పూజలు చేస్తారు. ఏది ఏమైనా.. ఏది నమ్మకమే అయినా.. మరేమైనా కూడా అక్కడికి మనోవ్యాధితో వెళ్ళినవారు ఆరోగ్యవంతులుగా తిరిగి వస్తారు. ఈ ఒక్క విషయంతో మనం అక్కడ దేవుడు కొలువై ఉన్నాడని నమ్ముదాం. 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: