తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై  గత కొన్ని రోజులుగా హైకోర్టులో విచారణ జరుగుతుంది. ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక  సమర్పిస్తుండటం  హైకోర్టు ఆర్టీసీ సమ్మె పై విచారణ వాయిదా వేయటం జరుగుతూనే ఉంది . అయితే హైకోర్టులో ఆర్టీసీ సమ్మె  పై విచారణ మొదలై  ఎన్నో రోజులు అయినప్పటికీ హైకోర్టులో విచారణ ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె మొదలైనప్పటి 43వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుంది. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. అటు ప్రభుత్వం కూడా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం విషయంలో మాత్రం సానుకూలంగా లేదు. ఈ నేపథ్యంలో సమ్మె  భవితవ్యం ఏంటనే దానిపై ప్రస్తుతం తెలంగాణలో చర్చ నడుస్తోంది. 

 

 

 

 ఇదిలా ఉండగా తాజాగా ఆర్టీసీ సమ్మె పై సంస్థ ఇంచార్జ్ ఎండీ  సునీల్ శర్మ హైకోర్టులో చివరి అపడవిట్  దాఖలు చేశారు. ఆర్టీసీ జేఏసీ తో తాము చర్చలు చేప్పట్టలేమని  అఫిడవిట్లో స్పష్టం చేశారు ఆర్టిసి ఇంచార్జ్ ఎండీ  సునీల్ శర్మ. తాజాగా  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే  డిమాండ్ తాత్కాలికంగా పక్కన పెడుతున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కూడా ఆర్టీసీ ఇన్చార్జి  ఎండీ సునీల్ శర్మ  సమర్పించిన అఫిడవిట్లో ప్రస్తావించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ను ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రస్తుతానికి తాత్కాలికంగా పక్కన పెట్టినప్పటికీ... మరోసారి ఈ డిమాండ్ తెరమీదికి తెచ్చి ఏ క్షణాన్నైనా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు ఆయన . 

 

 

 

 ఆర్టీసీ జేఏసీ నేతలు కేవలం వారి స్వార్థ ప్రయోజనాల కోసమే పక్షాలతో కలిసి కార్మికులను రెచ్చగొట్టి సమ్మెకు వెళ్లాలని ఆరోపించారు. యూనియన్ నేతలు అందరూ తమ స్వార్థం కోసం కార్మికులు సమ్మెలోకి తీసుకెళ్లి ఆర్టీసీ సంస్థకు 44% నష్టాన్ని కల్పించారని చెప్పారు. ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉందని ఇక ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో సంస్థ మరింత కూరుకుపోయిందని ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఆర్టీసీని  బాగు చేసే పరిస్థితి లేదంటూ అఫిడవిట్లో పేర్కొన్నారు ఆయన. కాబట్టి ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరపడం కష్టమని... కార్మికులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధం అంటూ ప్రకటించాలని హై కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 18న హైకోర్టులో సమ్మె  పై విచారణ నేపథ్యంలో అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే గత విచారణలో  హై కోర్టు సూచించిన సుప్రీం మాజీ న్యాయమూర్తులు కమిటీను కేసీఆర్ ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెలిసిందే. తదుపరి విచారణలో  ఆర్టీసీ ఇంచార్జ్ ఎండి సునీల్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్ పై  హైకోర్టు ఎలా స్పందిస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి: