ఈమధ్య రోజురోజుకు సైబర్ నేరగాళ్ల బెడతా ఎక్కువైపోతుంది. సైబర్ నేరగాళ్ల తీరు ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారిపోతుంది. అయితే ప్రస్తుతం ఇది వంటగ్యాస్ వరకు వచ్చేస్తుంది. ప్రస్తుతం ప్రజలందరూ అంతర్జాలం ద్వారా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసే ఏజెన్సీ కోసం పరిశోధిస్తున్నారు... అంతేకాకుండా అంతర్జాలం ద్వారానె  గ్యాస్ సిలిండర్లని  బుక్ చేస్తున్నారు కూడా. వినియోగదారులు సులభతరమైన సేవలు అందించేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి  గ్యాస్ ఏజెన్సీలు. అయితే వీటిని సైబర్ నేరాలు క్యాష్ చేసుకుంటున్నారు. గ్యాస్ సిలిండర్ కావాలంటూ ప్రజలు ఫోన్ చేస్తే  నేరుగా సైబర్ నేరస్తులు మాట్లాడుతున్నారు. అంతేకాదు సికింద్రాబాద్లోని గ్యాస్ ఏజెన్సీ సరఫరా వెబ్ సైట్ ను సైబర్ నేరాలు ఏకంగా హాట్ చేశారు కూడా. ఒక్క హైదరాబాద్లోనే నెల రోజుల వ్యవధిలో ఈ గ్యాస్ ఏజెన్సీ టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్ల మాయలో  నలుగురు వినియోగదారులను పడ్డారు. ఒక బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో... ఢిల్లీ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు ఈ తతంగం మొత్తం నడుపుతున్నట్లు ప్రాథమికంగా తెలుసుకున్నారు పోలీసులు. 



 అయితే గ్యాస్ ఏజెన్సీ వెబ్ సైట్లను   టార్గెట్ చేసిన  సైబర్ నేరగళ్ళు ... ముఖ్యంగా అంతర్జాలం ద్వారా సంప్రదిస్తున్న వారిని గురి  పెడుతున్నారు. సిలిండర్లు సరఫరా పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు . భాగ్యనగరానికి కొత్తగా వచ్చిన వారు కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకున్న వారు  గ్యాస్ ఏజెన్సీల చిరునామాలను  కోసం అంతర్జాలంలో పొందుతున్నారు . కానీ గ్యాస్ ఏజెన్సీల ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తే మాత్రం సైబర్ నేరగాళ్లు మాట్లాడుతున్నారు. సైబర్ నేరగాళ్లు గ్యాస్ ఏజెన్సీల చిరునామాలు ఫోన్ నెంబరు హ్యాక్  చేయడంతో నేరుగా ప్రజలు చేసే ఫోన్ కాల్స్ సైబర్ నేరగాళ్లకు వెళ్ళిపోతుంది. ఇక కాల్ వెళ్ళగానే సైబర్ నేరగాళ్లు  మాట్లాడుతూ ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా చిరునామా వివరాలు తెలుసుకుంటున్నారు. 



 ఇక గూగుల్ పే కానీ పేటియం ద్వారా కానీ తమ ఏజన్సీకి నగదు బదిలీ చేస్తే బుక్ చేసిన సిలిండర్ను 24 గంటల లోపు డెలివరీ చేస్తామంటూ మాయమాటలు చెప్పి నమ్మిస్తున్నారు. ప్రజలు కూడా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు అలా చెప్పారని నమ్మి వాళ్లు చెప్పినట్టుగా చేస్తున్నారు. ఇలా ఎంతోమంది తమ ఖాతాలో నుంచి నగదును పోగొట్టుకున్నవారు. ఇలా మోసపోయిన వారిలో ఎక్కువ మంది బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ నారాయణగూడ ప్రాంతాల్లో ఉన్న వారు ఎక్కువగా ఉన్నారు. గూగుల్ పే పేటీఎంలో ద్వారా పేమెంట్ చేయగానే... ఫోన్ నెంబర్ సాయంతో పూర్తి సమాచారం సేకరించి లక్షలకు లక్షలు దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు . ఇలా మోసపోయామని తెలుసుకున్న ప్రజలు వీటిని సైబర్ క్రైమ్ పోలీసులకు  తెలియజేయాలంటూ  పోలీసులు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: