రైతులకు ఏపి ప్రభుత్వం చాల మంచి తీపివార్త చెప్పింది. ఇక నుండి మీ భూమిని ఎవరు కబ్జా చేసే వీలు లేకుండా కొత్త ఐడియాను అమలు చేయడానికి సిద్దపడుతుంది. దీనివల్ల భూస్వాములకు తమ భూములను ఎవరు కబ్జా చేసినా తెలుసుకోవడం సులువు అవుతుంది. అదెలా అంటే  రెవెన్యూ శాఖ ప్రతి రైతు/భూ యజమానికి ఏటీఎం కార్డు తరహాలో పట్టాదారు కార్డులు అందజేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.


కార్డు పాన్‌కార్డు పరిమాణంలో ఈ ప్రతిపాదిత ఉండి, భూ యజమాని పేరు, చిరునామా దానిపై ఉంటుంది. ఈ చిన్న డిజిటల్‌ చిప్‌ అమర్చడం వల్ల కార్డును స్కాన్‌ చేస్తే సదరు రైతుకు ఏ గ్రామం/పట్టణంలోని ఏయే సర్వే నంబర్లలో ఎంత భూముందో కనిపిస్తుంది. ఇకపోతే ఈ విధానాన్ని అమలు చేయాలంటే ఒక్కదానికి ఎంత ఖర్చవుతుంది? అనే అంశాలపై రెండు సంస్థలతో సంప్రదింపులు జరిపారు.


ఇందుకు గాను కార్డు తక్కువ ధరకు పొందేలా పారదర్శకంగా టెండర్లు నిర్వహించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు భూ రికార్డులు రెవెన్యూ శాఖలో  తప్పుల తడకలుగా ఉన్నందున ప్రజలకు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతు ఉన్నాయని, ఇలాంటి సమస్యను పూర్తిగా ప్రక్షాళన చేయాలని రెవెన్యూ శాఖ ఇప్పటికే మార్గదర్శకాలిచ్చింది.


వచ్చే ఏడాది మే నెలాఖరుకి రికార్డుల్ని పూర్తిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న  రెవెన్యూ శాఖ ఈ పక్రియ పూర్తైన వెంటనే పట్టాదారు పాసు పుస్తకం స్థానంలో కొత్త కార్డులు ఇస్తారు. ఇకపోతే నకిలీలకు, ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్డులు ఇవ్వాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. ఇక ఈ విధానం అమలైతే తమ భూమిని ఎవరు కబ్జా చేస్తారో అనే భయం ఇకనుండి ఉండదని పేర్కొన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: