అయ్యప్ప మాల వేసుకొని స్వామివారి వద్దకు కాలినడక వెళుతున్న 13 భక్తులతో సహా ఓ శునకం 480 కిలోమీటర్లు నడిచింది. స్వాములు వారి వెనక్కి ఎప్పుడు తిరిగి చూసుకున్న వారి వంటే ఈ కుక్క అనుసరిస్తూ వచ్చింది. ఈ 13 మంది అయ్యప్ప స్వాములు ఆంధ్రప్రదేశ లోని తిరుమల నుంచి 31వ తారీకున కాలినడకన స్వామి వారి వద్దకు బయలుదేరారు. అయితే వారితో పాటే ఓ శునకం నడక మొదలు పెట్టింది. కానీ ఈ శునకాన్ని వాళ్లు గమనించలేదు. కొంత సమయం తరవాత రెండు మూడు సార్లు గమనించిన స్వాములు.. ఈ కుక్క ఎంతదూరం వస్తుందిలే.. మార్గం మధ్యలోనే వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ ఈ భక్తుల సుధీర్ఘ ప్రయాణంలో వారు ఎప్పుడు వెనక్కి తిరిగి చూసిన ఈ శునకం ప్రత్యక్షమై వారిని ఆశ్చర్యపరిచింది. ఈ అయ్యప్ప స్వాములు నవంబర్‌ 17న కర్ణాటకలోని కొట్టిగెరాకు చేరుకున్నారు.


ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ.. "మేము 480 కిలోమీటర్లు నడిచాము.. మాతో పాటు ఈ కుక్క కూడా అన్ని కిలోమీటర్లు నడిచింది. మాతో పాటు తెచ్చుకున్న ఆహారాన్ని కొంచెం ఈ శునకానికి పెట్టి దాని ఆకలి తీరుస్తూ వచ్చాము. ఈ కుక్కను కూడా మాతో పాటు శబరిమల తీసుకువెళతాం. ప్రతి సంవత్సరం కాలినడకన శబరిమల వెళ్తాము. ఈ సంవత్సరం మాతో పాటు ఓ కుక్క శబరిమలకు ప్రయాణం అవ్వటం మర్చిపోలేనిది" అంటూ సంతోషం వ్యక్తం చేశారు.


దీనికి సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ శునకానికి ఉన్న భక్తిని చాలామంది నెటిజన్స్ కొనియాడుతున్నారు.
రెండు నెలల తర్వాత మొట్టమొదటిగా ఆలయ తలుపులు తెరుచుకోగా.. ఇప్పటికే యాభై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: