
నేనెందుకు ఓడిపోయాను అని చంద్రబాబు ఇప్పటికీ మధన పడుతూంటారు. నిజానికి ఒక విజయానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఓటమిని కూడా అలాగే ఎన్నో ఉంటాయి. కానీ చంద్రబాబుకు మాత్రం ఒక్క కారణం కనిపించకపోవడం విడ్డూరమే. అందరికీ తెల్సీన విషయాలే బాబుకు తెలియడంలేదు. ఇక ఆయన అత్తగారు అయిన లక్ష్మీ పార్వతి మాత్రం బాబు ఎందుకు ఓడిపోయారో ఒక ప్రధాన కారణం కనిపెట్టేశారు.
అది ఆమె ఇపుడు విడమరచి చెప్పారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ చంద్రబాబుకు ఈసారి ఓటమి ఖాయమే కానీ దారుణమైన పరాభవానికి మాత్రం లోకేష్ కారణమని పక్కా క్లారిటీతో చెప్పేశారు. చంద్రబాబు తొలి మూడేళ్ళూ తెరచాటున ఉండి రాజకీయం నడిపారని, చివరి రెండేళ్ళలో మంత్రిగా కూడా తన సత్తా ఏమిటో చెప్పుకున్నారని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.
ఇక చంద్రబాబుకి మళ్ళీ అధికారం ఇస్తే ఏకంగా తన కుమారుడిని తెచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తారని జనం భయపడే దారుణంగా ఓడించారని ఆమె విశ్లేషించారు. అయితే చంద్రబాబుకు ఇప్పటికీ విషయం అర్ధం కావడంలేదని ఆమె ఎద్దేవా చేశారు. పుత్ర వ్యామోహంతో బాబు లోకేష్ ని తెచ్చి పార్టీ వారి నెత్తిన పెడుతున్నారని ఆమె విమర్శించారు.
టీడీపీని 1982లో మహానుభావుడు ఎన్టీయార్ ప్రారంభిస్తే కుక్క మూతి పిందె లాంటి లోకేష్ చేతిలో పార్టీని పెట్టడానికి బాబు తెగిస్తున్నాడని ఆమె విమర్శించారు. ఆ సంగతి తెలిసే పార్టీలో నాయకులు తిరిగబడుతున్నారని ఆమె హాట్ కామెంట్స్ చేశారు. బాబు లోకేష్ ని పక్కన పెట్టకపోతే 2022 నాటికి టీడీపీ భూస్థాపితం అవడం ఖాయమని లక్ష్మీపార్వతి గట్టి హెచ్చరికలే చేశారు మరి చూడాలి బాబు దీని మీద ఎలా స్పందిస్తారో, అల్లుడుగా ఏమంటారో కదా.
కామెంట్స్‌లో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయొద్దు. ఇతరుల పరువుకు నష్టం వాటిల్లేలా గానీ, వ్యక్తిగత దాడి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. ఏ వర్గాన్ని కించపరచేలా కామెంట్స్ ఉండరాదు. ఈ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండని కామెంట్లను అభ్యంతరకరమైనవిగా గుర్తించండి వాటిని తీసివేసేందుకు మాకు సహకరించండి- ఇండియాహెరాల్డ్ గ్రూప్