ఇపుడు టాలీవుడ్లో ఒకటే మోత మోగిపోతోంది. అది ఒక చిన్న సినిమా, హీరోకు, డైరెక్టర్ కి కూడా పెద్దగా అనుభవం లేదు, నిర్మాతలు కొత్త వారు అందరూ యంగ్ అండ్ ఎనర్జెటిక్. అయితే వీరిలో ఉన్న ఫైర్ మాత్రమే  పెట్టుబడిగా జార్జి రెడ్డి మూవీ రెడీ అయింది. నిజానికి జార్జి రెడ్డి టైటిల్ లోనే ఏదో ఫైర్ ఉందని అర్ధమవుతోంది.

 

ఇక పోస్టర్లు, టీజర్లు కూడా జార్జి రెడ్డి మీద పాజిటివ్ బజ్ చెలరేగేలా చేస్తున్నాయి. జార్జి రెడ్డి ఒక విధ్యార్ధి నాయకునిజీవిత  కధ. సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం ఉస్మానియా యూనివర్శిటీలో వామపక్ష భావాలు ఉన్న జార్జి రెడ్డి నాటి పరిస్థితుల్లో హక్కుల సాధన కోసం చేసిన పోరు ఈ చిత్ర కధగా ఉంది.

 

అంటే ఇది అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఫిల్మ్ గా చెప్పాలి. ఇక మరో విషయం ఏంటంటే జార్జి రెడ్డి హత్య చేయబడ్డాడు. యూనివర్శిటీ రాజకీయాలకు బలి అయ్యాడు. మరి జార్జి రెడ్డి మూవీలో ఉన్నది ఉన్నట్లుగా తీస్తే ఇపుడు ఉన్న కొన్ని  పార్టీలు, నాయకులకు కలుక్కుమంటుంది. మరి జార్జి రెడ్డి తీయాలనుకున్నపుడే ఇవన్నీ చిత్ర యూనిట్ కచ్చితంగా గుర్తించే ఉంటుంది. దానికి తగినట్లుగా కధను సిధ్ధం చేసుకుని ముందుకు సాగినట్లుగా కనిపిస్తోంది.

 

ఇక జార్జి రెడ్డి మూవీ విషయంలో   మెగా క్యాంప్ బాగా ఇన్వాల్వ్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా జార్జి రెడ్డి చిత్రం సాంగ్ ని రిలీజ్ చేయడం గొప్ప ప్రమోషన్ గా చెప్పుకోవాలి. బయోపిక్ అంటే ఇదీ, ఇలా తీయాలి  అని మెగా బ్రదర్ నాగేంద్రబాబు అన్నారు. ఇతర చిత్ర ప్రముఖులు కూడా జార్జి రెడ్డి కి మద్దతుగా మాట్లాడుతున్నారు. నిజానికి జార్జి రెడ్డి వంటి చిన్న సినిమాకు మంచి సపోర్ట్ దొరికింది. చూడాలి ఈ మూవీ అర్జున్ రెడ్డిలా సెన్సేషనల్ హిట్ అవుతుందేమో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: