గత కొంతకాలంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే .ఉల్లిని  కొనాలంటే సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి కీ  ఉల్లి ధరలు  చేరుకున్నాయి. ఇక సామాన్య ప్రజలకు ఉల్లిని కోయకుండానే ధర చూస్తే చాలు కళ్ల వెంట నీళ్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లి ధరలతో చాలా మంది సామాన్య ప్రజలు ఉల్లి లేకుండానే రోజూవారి ఆహారాన్నే వండుకుంటున్నారు. ఇంకొంతమంది ధరలు పెరిగినప్పటికీ కూడా రోజువారీ ఆహారంలో ఉల్లి  తప్పనిసరి కాబట్టి ఉల్లినీ కొంటే జేబులు ఖాళీ  అవుతున్నప్పటికీ కూడా కొనక తప్పడం లేదు . సామాన్య ప్రజలకు భారంగా మారిన ఉల్లి ప్రజలందరినీ బెంబేలెత్తిస్తున్నది . దేశవ్యాప్తంగా ఉల్లి ఆకాశాన్నంటడంతో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. 

 

 

 

 వర్షాకాలం దేశ వ్యాప్తంగా వర్షాలు సాధారణ స్థాయి కంటే ఎక్కువ మోతాదులో పడడంతో వరదలు వచ్చి  రైతుల పంటలు దెబ్బతిన్నాయి.  ఈ క్రమంలోనే ఉల్లి పంట కూడా దెబ్బ తిన్నది.దీంతో   ఉల్లి దిగుబడి  తగ్గిపోవడంతో దేశవ్యాప్తంగా ఉల్లి  కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. కర్నూలు మార్కెట్ లో ఉల్లి ధర భారీగా పెరిగిపోయింది. ఈరోజు ఉల్లి క్వింటాల్ ధర 6270 రూపాయలు పలుకుతుంది . అయితే గత ఐదేళ్ల నుంచి  ఉల్లి ధర ఇదే గరిష్ట ధర కావడం విశేషం. అయితే వరదల ప్రభావంతో ఇటీవలే ఉల్లి  దిగుబడి భారీగా తగ్గిపోవడంతోనే ఎక్కడ చూసినా గణనీయంగా ఉల్లి ధరలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. 

 

 

 

 బహిరంగ మార్కెట్లో కూడా 60 రూపాయల నుంచి 70 రూపాయల వరకు ఉల్లి ధర పలుకుతుంది .కొన్ని  ప్రాంతాల్లో అయితే ఏకంగా వంద రూపాయలు పలుకుతుంది ఉల్లి ధర. ఉల్లి ధర  సామాన్య ప్రజలకు భారంగా మారడంతో... రైతు బజార్లలో 25 రూపాయలకే ఉల్లిని అందించేందుకు  కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నెలరోజుల్లోగా  విదేశాల నుంచి ఉల్లిని ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోంది. దేశ వ్యాప్తంగా ఏర్పడిన ఉల్లి కొరతతో  ఇప్పటికే భారత్ నుంచి విదేశాలకు ఉల్లి  ఎగుమతులు ఆగిపోయాయి.ఉల్లి కొరత  రోజురోజుకు ఎక్కువవుతుండటంతో  ఉల్లి ధర మరింత పెరుగుతుందని అంటూ అందరూ బెంబేలెత్తిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: