మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి మహారాష్ట్ర లో రోజుకో ట్విస్ట్ తెర మీద వస్తూనే  ఉంది. బిజెపి శివసేన కూటమి మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ శివసేన తమ పార్టీ నాయకుడు కి  సీఎం పదవి కావాలంటూ మొండి పట్టు పట్టడంతో బిజెపి శివసేన కూటమి విభేధించింది. దీంతో శివసేన పార్టీ ఎలాగైనా సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని ఎన్సీపీ కాంగ్రెస్ తో మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్ర లో రాష్ట్రపతి పాలన విధించినపటికి మహా రాజకీయాలు  రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అన్ని పార్టీలకు సమయం ఇచ్చినప్పుడికి ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడంతో మహారాష్ట్రలో  రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. 

 

 

 

 అయితే శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అందరూ అనుకున్నారు. శివసేనకు సీఎం పీఠం తో పాటు 16 15 12 ఫార్ములా ప్రకారం మంత్రి పదవులను కూడా ఈ మూడు పార్టీలు పంచుకోనున్నాయంటూ తెగ ప్రచారం జరిగింది. కాగా  ఈ క్రమంలో మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్ తెరమీదకు వచ్చేసింది . ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలతో పొత్తుపై శివసేన పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 17 మంది శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎన్సీపీ తో పొత్తు ఏర్పాటు చేయడంపై శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. 

 

 

 

 అయితే ఈ విషయంపై శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే తో చర్చించేందుకు  17 మంది ఎమ్మెల్యేలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికోసం పార్టీ సీనియర్ నేత మనోహర్ జోషి తో కలిసి మాతోశ్రీ  కి వెళ్లారని.. అయితే వారికి శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే అపాయింట్మెంట్ ఇవ్వలేదని సమాచారం. మరోవైపు మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు బాలాసాహెబ్  తోరట్,  పృథ్వీరాజ్ చౌహాన్,  నసీమ్ ఖాన్ లు ... పార్టీ అధిష్టానంతో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన తో కలిసి వెళ్లే అంశంపై మరోమారు ఆలోచించినున్నట్లు  తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ పొత్తుతో  ప్రభుత్వం ఏర్పాటు వరకు చేరుతుందా లేదా అన్నది మరోసారి అనుమానాలు రేకెత్తిస్తుంది. అటు బిజెపి కూడా మహారాష్ట్రలో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మంతనాలు జరుపుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: