ప్రభుత్వ చీఫ్ విప్ srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. మొన్నటి వరకూ దాడులు.. నిన్న ఇసుక.. ఇప్పుడేమో ఇంగ్లిష్.. అన్నింటినీ రాజకీయం చేస్తున్నారని, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కాల్‌‌మనీ సెక్స్‌ రాకెట్‌ నిందితులను వదిలేయాలని చంద్రబాబు చెప్పారని ఆరోపించారు. ఈ రోజు ఆధారాలతో సహా కేసులు పెడుతుంటే తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ లబోదిబోమంటున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు కులమతాలను రెచ్చగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడితే క్రిస్టియానిటీ కోసమంటూ దుర్మర్గపు ప్రచారానికి తెరతీశారని.. అసలు మనుషులా? రాక్షసులా? అనిపిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి తెలుగుపై ప్రేమలేదని క్రియేట్‌ చేసేందుకే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. అక్రమ కేసులు పెడుతున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జగన్ పాలనలో ఎంతపెద్ద వ్యక్తి తప్పుచేసినా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. నాకే నోటీసులు ఇస్తారా అని మాట్లాడుతున్నారని.. చంద్రబాబేమైనా చట్టానికి అతీతుడా అని ప్రశ్నించారు. తప్పుచేస్తే నోటీసులు ఇస్తారని..కేసులు కూడా పెడతారని స్పష్టం చేశారు.

 చంద్రబాబు చింతమనేని ప్రభాకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని చేసిన వ్యాఖ్యలపై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 18 కేసులు ఉన్న చింతమనేనిని బాబాగా అభివర్ణిస్తున్నారని.. చంద్రబాబు వ్యాఖ్యలు అరాచకాలను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు సంతోషంగా ఉంటే.. చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. టీడీపీకి 23 స్దానాలు ఇచ్చినందుకు ప్రజలు చింతిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన తనయుడు లోకేష్ పనీపాటా లేకుండా రోజూ ట్వీట్లు చేస్తుంటాడంటూ ధ్వజమెత్తారు. దొంగపేపర్, మాయ టీవీ అని వయస్సుకు మించిన మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్‌ వల్లే చంద్రబాబుకు ఈ పరిస్దితి దాపురించిందని.. ఇంకా అలాగే మాట్లాడితే టీడీపీ క్లోజ్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: