2019 ఎన్నికల్లో భారీ మెజార్టీని సొంతం చేసుకొని ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వైసీపీ పార్టీ. ఇక ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పాలన గాడిలో పడింది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు మరెన్నో అభివృద్ధి పథకాలు ఇంకెన్నో  కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రిగా ముందుకు సాగుతున్నారు. ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా జగన్  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడి పేద విద్యార్థులకు కూడా మెరుగైన విద్యను అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే అమ్మవారి పథకానికి ఊపిరి పోశారు సీఎం జగన్

 

 

 

 అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థి పాఠశాలకు వెళ్లి చదువుకునేందుకు 15 వేల రూపాయల చేయూతను  అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థి పాఠశాలలకు వెళ్లి చదువుకోవడం ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు జగన్ సర్కార్ తెలిపింది. అంతే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టి కార్పొరేట్ స్థాయిలో పేద విద్యార్థులకు కూడా మెరుగైన విద్యను అందించి పేద విద్యార్థుల అభివృద్ధి చెందే నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంతో తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి ఉందంటూ  ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం పట్టు విడవక ముందుకు సాగుతున్నారు. 

 

 

 

 

 అయితే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మాత్రం ప్రవేశపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుభాషను మసకబారేలా చేస్తున్నారంటూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి ప్రతిపక్షాలు . ఇదిలావుండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో సంచలన పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న  విద్యార్థులకు మేలు జరిగేలా జగనన్న విద్య వసతి పథకానికి ఊపిరి పోశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ,  ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ లేదా ఆపైన కోర్సులు చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్య వసతి పథకాన్ని అమలు చేయనున్నారు. విద్యార్థుల వసతి ఆహార ఖర్చులకు విద్యార్థులకు ప్రతి ఏటా 20 వేల రూపాయలను అందించేందుకు  జగన్ సర్కారు నిర్ణయించింది. కాగా ఈ మొత్తం సొమ్మును విద్యార్థుల తల్లి ఖాతాల్లో  మాత్రమే జమ చేస్తానని నిబంధన విధించింది జగన్  సర్కారు. అటు సంక్షేమ వసతి గృహాలు కాలేజీ అనుబంధ హాస్టల్లో ఉంటూ  చదువుకునే విద్యార్థులకు మెస్ చార్జీలను మినహాయించి మిగతా మొత్తాన్ని జనవరి నెలలో చెల్లించేందుకు చర్యలు చేపట్టింది  జగన్ సర్కార్ .

మరింత సమాచారం తెలుసుకోండి: