26,50,000. ఏంటీ అంకె అనుకుంటున్నారా? 2018లో యూఎస్‌‌లో ఉన్న మనోళ్ల సంఖ్య. అమెరికన్‌‌ కమ్యూనిటీ సర్వే (ఏసీఎస్‌‌) ఆ దేశంలో ఎంతమంది ఫారినర్లు నివసిస్తున్నారో సర్వే చేసింది. 2018 జులై 1 నాటికి అమెరికాలో ఉంటున్న ఫారినర్ల సంఖ్య 4.7 కోట్లని, మొత్తం యూఎస్‌‌ జనాభా (32.7 కోట్లు)లో ఈ సంఖ్య 13.7 శాతమని వెల్లడించింది. యూఎస్‌‌ సెన్సస్‌‌ ప్రకారం ఫారినర్లంటే పుట్టుకతో యూఎస్‌‌ సిటిజన్‌‌షిప్‌‌ లేనివాళ్లు. దీంట్లో అమెరికా పౌరసత్వం పొందిన ఫారినర్లు, గ్రీన్‌‌ కార్డు ఉన్నవాళ్లు, ఇంటర్నేషనల్‌‌ స్టూడెంట్లూ ఉంటారు. మొత్తం  ఫారినర్ల జనాభాలో ఇండియన్లు 5.9 శాతమని, యూఎస్‌‌ జనాభాలో ఒక్క శాతమని చెప్పింది. ఈ వివరాలను అక్కడి థింక్‌‌ట్యాంక్‌‌ సెంటర్‌‌ ఫర్‌‌ ఇమిగ్రేషన్‌‌ స్టడీస్‌‌ (సీఐఎస్‌‌) వెల్లడించింది.

 

2010 నుంచి 2018 మధ్య ఇండియా నుంచి అమెరికా వెళ్లిన వాళ్ల సంఖ్యనూ సీఐఎస్‌‌ అంచనా వేసింది. గత 8 ఏళ్లలో వీళ్ల సంఖ్య 8.7 లక్షలు (49 శాతం) పెరిగిందని చెప్పింది. 1990 ద‌శ‌కంలో 4.5 లక్షల మందే ఉండేవారని, 1990 నుంచి 2018 వరకు లెక్కేస్తే 489 శాతం పెరిగిందని పేర్కొంది.  2017లో యూఎస్‌‌లో ఉన్న మనోళ్ల సంఖ్య 26 లక్షల పదివేలు. ప్ర‌స్తుతం...26, 50,000. గతేడాదితో పోలిస్తే 1.5 శాతం పెరిగారు. మ‌రోవైపు  చైనీయుల సంఖ్య కూడా పెరిగిందని, 2010లో 21. 60 లక్షలుంటే 2018కి 28.4 లక్షలకు  చేరిందని,  మొత్తంగా 32% పెరుగుదల (6.78 లక్షలు) నమోదైందని పేర్కొంది.

 

కాగా,  2018 జులై 1 నాటికి అమెరికాలో ఉంటున్న ఫారినర్ల సంఖ్య 4.7 కోట్లని, మొత్తం యూఎస్‌‌ జనాభా (32.7 కోట్లు)లో ఈ సంఖ్య 13.7 శాతమని వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఫారినర్ల సంఖ్య 0.4 శాతమే పెరిగిందని పేర్కొంది. 2010తో పోలిస్తే మాత్రం సంఖ్య 11.8 శాతం పెరిగిందని, అప్పుడు 4 కోట్ల మంది విదేశీయులు అమెరికాలో ఉన్నారని వివరించింది. 2017లో 14.5 లక్షల మంది ఫారినర్లు లీగల్‌‌గా, ఇల్లీగల్‌‌గా యూఎస్‌‌లో సెటిలయ్యారని సీఐఎస్‌‌ పేర్కొంది. అదే 2016లో వీళ్ల సంఖ్య 17.5 లక్షలని, 2015లో 16.2 లక్షలని వివరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: