డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్... ఈ ఆటగాడి ఆట తీరే వేరు. ఒకసారి మైదానంలోకి అడుగు పెట్టాడు అంటే సొగసైన షాట్లు కొట్టాల్సిందే... పరుగుల వరద పారాల్సిందే . టీమిండియా డేరింగ్ డాషింగ్ ఓపెనర్ గా ఎన్నో మ్యాచ్లకు భారీ స్కోరు ను అందించిన గొప్ప ఓపెనర్ శిఖర్ ధావన్. ఇక  శిఖర్ ధావన్ అంటే ముందుగా గుర్తొచ్చేది డాన్స్. కొంచెం సంతోషంగా ఉంటే చాలు మైదానంలోగాని డ్రెస్సింగ్ రూమ్ లో గాని డాన్స్ చూస్తూ ఉంటాడు ఈ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్. ఇక అందరితో కలివిడిగా ఉంటూ జోక్స్ వేస్తూ నవ్వుతూ ఉంటాడు. అయితే శిఖర్ ధావన్ ని  అందరూ గబ్బర్ సింగ్ అని పిలుస్తుంటారు. శిఖర్ ధావన్ మ్యాచ్  జరుగుతున్నప్పుడు చిన్న సంతోషపడే సమయం వచ్చిన తొడగొట్టడం మీసం తిప్పడం చేస్తుంటారు. అందుకే శిఖర్ ధావన్ ను   గబ్బర్ అని పిలుస్తుంటారు. అయితే టీమిండియా డేర్ అండ్  డాషింగ్ ఓపెనర్ గబ్బర్ సింగ్ కి  అటు కాని ఫాలోయింగ్ కూడా తక్కువేమీ లేదు... డేర్ అండ్ డాషింగ్ బ్యాటింగ్  తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 

 


 ఇక  శిఖర్ ధావన్ ఒక్కసారి మైదానంలోకి అడుగు పెట్టాడంటే  టీమిండియాకు భారీ స్కోరు వస్తుందన్న నమ్మకం క్రికెట్ ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇప్పటికే ఎన్నోసార్లు టీమిండియాని భారీ స్కోరు చేసి విజయతీరాలకు నడిపించాడు శిఖర్ ధావన్. ఇక శిఖర్ ధావన్ బ్యాట్ పట్టాడంటే  బౌలర్లు ఆచితూచి పంతులు వేయాల్సిందే. ఎందుకంటే ఏ బంతి ఎటునుంచి సిక్స్ పోతుందో... ఎటునుంచి బౌండరీ దాటుతుందో తెలీదు మరి. ఇలా ఉండగా తాజాగా డేరింగ్ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ కాలికి గాయమైంది. ప్రస్తుతం శిఖర్ ధావన్  మస్తాన్ అలీ దేశవాళీ పోటీలో ఆడుతున్నారు. అయితే ఈ దేశవాలి   పోటీలో ఓ మ్యాచ్లో శిఖర్ ధావన్ మోకాలికి దెబ్బ తగలడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

 

 అయితే మోకాలికి అయిన గాయం అయి మోకాలు  నుంచి రక్తం కారుతున్నప్పటికీ  కూడా శిఖర్ ధావన్ మాత్రం నవ్వులు చిందిస్తూ తన ట్రేడ్ మార్క్ ను చూపిస్తూ హుషారుగా తొడ  కొట్టేసాడు. అంతేకాదండోయ్ అక్కడ ఆస్పత్రి సిబ్బంది తో కూడా హుషారుగా ఫోటోలు దిగాడు. కాలుకు దెబ్బ తగిలి రక్తం కారుతున్నప్పటికీ   కూడా ముఖంపై మాత్రం శిఖర్ ధావన్ కు చిరునవ్వు చెదరలేదు. ఈ ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసిన శిఖర్ ధావన్ మనం పడుతుంటాం లేస్తుంటాం కొన్నిసార్లు దెబ్బతింటం  మళ్లీ కోరుకుంటాం... వివిధ పరిస్థితుల పై ఎలా స్పందించాలి అన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూల్ గా ఉంటే ఎలాంటి పరిస్థితినైనా సానుకూల దృక్పథంతో ఎదురుకోవాలని సూచించారు. నాలుగైదు రోజుల్లో మైదానంలోని అడుగుపెడుతాను  అంటూ ట్వీట్ చేసాడు గబ్బర్ సింగ్. ఇదిలా ఉండగా అటు టీమిండియా కూడా వరుస టెస్ట్ సిరీస్లు  గెలుచుకుంటు దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: