ప్రయాణ భారం తగ్గింది ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణాన్ని అందించేందుకు  తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా  ప్రవేశపెట్టింది హైదరాబాద్ మెట్రో. మెట్రో సేవల రాకతో  ప్రయాణికులకు భాగ్యనగర ప్రయాణంలో సులభతరం అయిపొయింది . ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఎలాంటి పొల్యూషన్ లేకుండా మెట్రో ద్వారా  ప్రయాణిస్తున్నారు జనాలు. అంతేకాకుండా సమయం కూడా వృధా అవకుండా తక్కువ సమయంలోనే ప్రయాణాలు చేస్తున్నారు. అటు  వాహనాల ద్వారా అయితే గంటలు గంటలు రోడ్లమీద వేచి ఉంటూ... సిగ్నల్స్ పడే వరకు ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది... కానీ మెట్రోలో  మాత్రం అవి లేకుండానే ప్రయాణిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రోను  ఇప్పటికే ఎన్నో రూట్లకు  విస్తరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా  హైదరాబాద్ ఐటీ  ఉద్యోగులకు శుభవార్త చెప్పింది . 

 

 

 

 ప్రస్తుతానికి మెట్రో సేవలు హైటెక్ సిటీ వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఉద్యోగులందరూ ఈ మెట్రో ద్వారానే ఆఫీస్ లోకి వెళ్లి రావడం చేస్తున్నారు. వాహనాల్లో వెళ్లడం కన్నా  మెట్రోలో వెళ్లడానికి ఐటీ ఉద్యోగులు మొగ్గుచూపుతున్నారు. ఎలాంటి సమయం వృథా లేకుండా వెళ్లడం సహా  మెట్రో ప్రయాణ ఛార్జీలు కూడా వారికి అందుబాటు ధరలోనే ఉండడంతో ఎక్కువగా మెట్రో ని ఆశ్రయిస్తున్నారు ఐటీ ఉద్యోగులు . అయితే ఇప్పుడు వరకు హైటెక్ సిటీ వరకు ఉన్న మెట్రో  సేవలను నెల 29 నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు అందుబాటులోకి తీసుకురానుంది ప్రభుత్వం . ఫలితంగా మెట్రో కారిడార్ 3 లో నాగోల్  నుంచి మైండ్ స్పెస్  వరకు మొత్తం 28 కిలోమీటర్ల దూరం మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది . 

 

 

 

 ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉన్న మైండ్స్పేస్ జంక్షన్ నుంచి మెట్రో సేవలు ప్రారంభం అయితే ఎంతో మంది ఐటి ఉద్యోగులకు ఊరట లభించనుంది. అంతేకాకుండా ఎప్పుడెప్పుడు మైండ్స్పేస్ వరకు మెట్రో సేవలు ప్రారంభిస్తారా అని  ఎదురుచూసిన ఐటీ  ఉద్యోగులకు ఇది ఒక తీపి కబురు అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఐటి ఉద్యోగులు అందరూ హైటెక్ సిటీ, రాయదుర్గం  చెరువు మెట్రో స్టేషన్ల ద్వారా పరాయనించి అక్కడి  నుంచి షటిల్  సర్వీసుల ద్వారా కంపెనీలకు చేరుకుంటున్నారు. ఇప్పుడు మైండ్ స్పేస్ జంక్షన్ వరకు మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే వారి  ప్రయాణం మరింత సులభతరం అయ్యే అవకాశం ఉంది. మైండ్ జంక్షన్ వరకు ప్రారంభించిన మెట్రో సేవలను ఈ నెల 29న మంత్రులు కెటిఆర్,  పువ్వాడ అజయ్ కుమార్ లు ప్రారంభించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: