చంద్రబాబునాయుడు ఎప్పుడూ అంతే. ఏదైనా ప్లస్ వస్తే తన గొప్పతనమంటారు. అదే మైనస్ ఎదురైతే మాత్రం తప్పంతా ఎదుటివారిపై తోసేస్తారు. అలాగే సమస్యల్లో నుండి తప్పించుకునేందుకు పక్కవాళ్ళని  బకరాలను చేయటానికి ఏమాత్రం వెనకాడరన్న విషయం చాలాసార్లు రుజువైంది.  ఇదంతా ఎందుకంటే తాజాగా ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టే విషయంలో పవన్ కల్యాణ్ ను చంద్రబాబు బకరాను చేసేశారు.

 

ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియంను  జగన్మోహన్ రెడ్డి  ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. నిర్ణయం ప్రకటించగానే చంద్రబాబునాయుడు అండ్ కో , ఎల్లోమీడియాతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా రెచ్చిపోయారు. జగన్ ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేస్తు నానా యాగీ చేశారు.

 

ఇంత యాగీ చేసిన చంద్రబాబు చివరకు ఒక్కసారిగా చప్పబడిపోయారు. తమ హయాంలోనే ఇంగ్లీషుమీడియంను ప్రవేశపెడుతూ జీవో ఇచ్చామని ఇపుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మొదట్లో అంత గోల చేసిన చంద్రబాబు ఎందుకిపుడు చప్పబడిపోయారు ? ఎందుకంటే తల్లి,దండ్రులు, విద్యార్ధుల నుండి తీవ్ర వ్యతిరేకత మొదలైందట ఊర్లలో.

 

జనాల మూడ్ ను పట్టించుకోకుండా ఎంతగోల చేసినా ఉపయోగం ఉండకపోగా రివర్సవుతుందని గ్రహించిన చంద్రబాబు ఒక్కసారిగా చప్పపడిపోయారు. ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టటానికి తాను తీసుకున్న చర్యలను ఇపుడు ఘనంగా ప్రకటించుకుంటున్నారు. సరే అదే పద్దతిలో తాను కూడా ఇంగ్లీషు మీడియంలోనే చదువుకున్నట్లు పుత్రరత్నం నారా లోకేష్ కూడా చెప్పుకున్నారు.

 

ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియం ప్రవేశపెట్టిన ఘనతలో ఇపుడు తండ్రి, కొడుకులు క్రెడిట్ వాటా కోసం నానా తిప్పలు పడుతున్నారు. సరే వీళ్ళ సంగతి ఇలాగుంటే మరి పవన్ సంగతేంటి ?  చంద్రబాబు కీ ఇచ్చాడు కదాని రెచ్చిపోయాడు.  జగన్ కు వ్యతిరేకంగా నానా రచ్చ చేశాడు. ఎప్పటెప్పటివో పేపర్ క్లిప్పింగులను కాపీ పేస్టు చేసి ట్విట్టర్లో పెద్ద పెద్ద పోస్టులే పెట్టాడు. తాను ఎవరి కోసమైతే జగన్ పై నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలు చేస్తు గోల చేశారో అదే చంద్రబాబు ఇపుడు క్రెడిట్ వాటా కోసం తిప్పలు పడుతున్నారు. అంటే ఆ మొత్తం ఎపిసోడ్ లో పవన్ మాత్రమే బకరా అయిపోయిన విషయం స్పష్టం అర్ధమైపోతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: