భారత అంతర్గత విషయాలపై నోరుపారేసుకోవడం పాక్ కి పరిపాటిగా మారిపోయింది. సియాచిన్‌ అనేది ఒక వివాదాస్పద ప్రాంతమని, పర్యాటకుల సందర్శనల కోసం దానిని తెరవకూడదని పాకిస్థాన్ గురువారం వ్యాఖ్యానించింది. తాజాగా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్‌ పై పాకిస్థాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.  

సియాచిన్‌ లో పర్యాటకాన్ని భారత్ చేపట్టింది. ఓ మీడియా అడిగిన ప్రశ్నకు పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ముహమ్మద్‌ ఫైజల్‌ సమాధానం ఇస్తూ పై విధంగా వ్యాఖ్యానించాడు. అయినా, ఈ విషయంలో తాము భారత్‌ నుంచి ఎలాంటి మంచిని కానీ.. లేదా సానుకూలతను కానీ.. ఆశించడం లేదని విమర్శించాడు. బలవంతంగా ఆక్రమించుకున్న వివాదాస్పద ప్రాంతంలో భారత్‌ పర్యాటకాన్ని ఎలా ప్రారంభిస్తుందని ఆయన ప్రశ్నించారు. 

గురునానక్ 550 వ జయంతిని పురస్కరించుకుని కర్తాపూర్‌ను సందర్శించే యాత్రికులకు భారత్ అడ్డంకులు సృష్టిస్తోంది అని గురువారం ముహ్మద్ ఫైజల్ ఆరోపించాడు. రోజుకు 5 వేల మంది యాత్రికులు గురుద్వారాను దర్శించుకుంటారని భావించాం, కానీ అంతకంటే తక్కువ మందే వస్తున్నారని అన్నారు. కార్తాపూర్ కారిడార్‌ను నవంబరు 9న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కారిడార్‌ను అందుబాటులోకి తేవడంతో భారత్‌లోని సిక్కులు.. పాక్ భూభాగంలో గురునానక్ దేవ్ తన చివరి రోజుల్లో గడిపిన గురుద్వారాను సందర్శించడానికి ఎలాంటి వీసా అవసరం ఉండదు. ఇది పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ డేరా బాబా నానక్ నుంచి పాక్‌లోకి కర్తాపూర్ సాహెబ్‌తో కలుపుతుంది.

కాగా, సియాచిన్ గ్లేసియర్‌లో ఇటీవల భారత్ పర్యాటకుల సందర్శనలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సియాచిన్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి కుమార్‌ పోస్ట్‌ వరకు పర్యాటకులు వెళ్లేందుకు అనుమతించింది. ఈ మేరకు అక్టోబర్‌ 21న పర్యాటకులకు అనుమతినిచ్చే కార్యక్రమాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్మీ చీఫ్ బిపిన్‌ రావత్‌తో కలిసి ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: