తెలంగాణాలో ఆర్టీసీ సమ్మే మహాసమరాన్ని తలపించింది. నువ్వా నేనా అన్నట్లుగా కార్మిక సంఘాల మధ్య, ప్రభుత్వం మధ్య సాగిన ఈ పోరులో తుది విజయం కేసీయారే సాధించాడు. ఇకపోతే ఇప్పటికే పస్తులూంటున్న కార్మికుల భవిష్యత్తు ఇకనుండి అడ్డాకూలీలుగా మారనున్నాయా? అనే అనుమానం కార్మిక కుటుంబాల్లో మొదలైంది.

 

 

ఇందులో ఎక్కువగా నష్టపోయింది కార్మికులు మాత్రమే. అశ్వద్ధామా బాగానే ఉన్నాడూ? కేసీయార్ కూడా బాగానే ఉన్నాడు? తెలంగాణ ప్రజల జేబులకు చిల్లులు పడగా వేయిల మంది కార్మికుల జీవితాలూ బజారుపాలు కానున్నాయా అనే అనుమానాలు పలువురిలో తలెత్తుతున్నాయి. ఇకపోతే హైకోర్టు శుక్రవారం అంటే ఈ రోజు ఆర్టీసీ రూట్ల ప‍్రైవేటీకరణకు  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ సెక్షన్‌ 102 ప్రకారం ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయని ధర్మాసనం వెల్లడించింది.

 

 

ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని, ప్రభుత్వానికి, ప్రైవేటు మధ్య ఆనందకర పోటీ ఉన్నప్పుడే లాభాలు సాధ్యమవుతాయని గతంలో చెప్పిన హైకోర్టు ఆ మాటకే ఇప్పుడు కట్టుబడి తీర్పు చెప్పింది. ఇక ఇప్పటికే రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన అన్ని పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేస్తూ, 5100 బస్సులను ప్రైవేట్‌కు అప్పగించడం తప్పు కాదని స్పష్టం చేసింది.

 

 

మరోవైపు పిటిషనర్‌ రూట్ల ప్రైవేటీకరణపై సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని  పేర్కొన్నారు. కాగా ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ కార్మికుల నెత్తిన పిడుగులాంటి వార్తే. భేషరతుగా విధుల్లోకి తీసుకుంటే ఉద్యమాన్ని విరమించి విధుల్లోకి చేరతామన్న ఆర్టీసీ కార్మికులకు ఇప్పుడున్న పరిస్దితి కొరివితో తలగోక్కున్నట్లుగా మారింది.

 

 

ఇకపోతే  ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న నేపధ్యంలో ముఖ్యమంత్రి ప్రకటనపై ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ఆధారపడి ఉంది. ఇప్పటికే కార్మికులందరు తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతాయో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: