ఏపీని చాలా మంది ముఖ్యమంత్రులు పాలించారు. వారిలో కొందరికి మాత్రమే తమదైన ముద్ర ఉంటుంది,  అందులో ఆంధ్ర రాష్ట్ర  తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని చెప్పుకుంటే ఠక్కున  ప్రకాశం బ్యారేజ్ గుర్తుకువస్తుంది. అలాగే ఆయన కర్నూల్ ని రాజధానిగా చేసి ఆంధ్ర రాష్ట్రానికి చేసిన అసలైన సేవ కనిపిస్తుంది. 

 

అదే వరసలో ఎన్టీయార్ పేరు చెప్పుకుంటే రెండు రూపాయలకు కిలో బియ్యం గుర్తుకువస్తుంది. ఇక వైఎస్సార్ విషయానికి వస్తే ఆయన ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీ రీ యంబర్స్మెంట్ అలా ఎన్నో  పధకాలు గుర్తుకువస్తాయి. ఇపుడు వైఎస్ జగన్ కూడా తనదైన మార్క్ పాలనలో చూపించాలనుకుంటున్నారు. ఆయన ఆరు నెలల పాలన చూస్తే ఆయన నిర్ణయాలు ఎంత దూకుడుగా ఉంటాయో అర్ధమవుతుంది.

 

ఇక జగన్ పాలనలో ఎన్ని నిర్ణయాలు తీసుకున్న ఒక ఎత్తు సర్కార్ బడులలో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రవేశపెట్టడం మరో ఎత్తు అన్నట్లుగా చూడాలని అంటున్నారు. ఇది ఒక విధంగా జగన్ తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయంగా చెప్పుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువు అంటే మాటలు కాదు.

 

ఒక తరం కాదు, తరతరాలు ఇక మీదట అద్భుతమైన అవకాశాలతో ముందుకు దూసుకుపోతారు. పైసా కూడా ఖర్చు చేయకుండా మంచి చదువులకు అవకాశం లభిస్తుంది. జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చు కానీ ఇది మాత్రం శాశ్వత ఉపాధిని ఇస్తుంది. పేద పిల్లలు ఇకపైన అమెరికా చదువులకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ వస్తే ప్రపంచం తలుపు తీసినట్లే.

 

అవకాశాలకు ఆకాశమే హద్దు. ప్రతిభను బట్టి పేద పిల్లలు ఎక్కడైనా సెటిల్ కావచ్చు. ఇది నిజంగా మంచి నిర్ణయం. భాషతోనూ, మతంతోనూ ముడిపెట్టకుండా అంతా మద్దతు ఇవ్వాల్సిన నిర్ణయం. జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఆఖరుకు చంద్రబాబు సైతం మద్దతు తెలిపారంటేనే ఇది గొప్ప ప్రజా నిర్ణయం అని అర్ధమవుతోంది కదా. నిజానికి ఎక్కడ సర్వే చేసినా కూడా ప్రజలు  ఆంగ్ల  బోధనను ఆహ్వానిస్తున్నారు.

 

నిజానికి ఈ రోజు జగన్ ఏపీకి సీఎం గా ఉన్నారు. భవిష్యత్తులో  కొన్ని తరాలు సాగినా కూడా నా ఆయన‌ను స్మరించుకునేలా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రశంసించదగినది. ఈ నిర్ణయం ద్వారా జగన్ చరిత్రపురుషుడు అయ్యాడని చెప్పినా తప్పులేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: