ఐదేళ్ల క్రితం నూతన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘన విజయాన్ని అందుకోవడం జరిగింది. అయితే అప్పట్లో ఆ పార్టీకి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం, అనంతరం ఆంధ్రకు రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఆ ఎన్నికల సమయంలో ఆంధ్రకు ప్రత్యేక హోదా, అలానే విభజన హామీల విషయమై హామీ ఇచ్చిన టిడిపి పార్టీ, వాటిని నెరవేర్చడంలో మాత్రం చాలావరకు విఫలం అవ్వడంతో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. 

 

ఇకపోతే ఈ ఎన్నికల్లో వైసిపి ఘన విజయాన్ని దక్కించుకుని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రకు సీఎం అయ్యారు. అయితే టిడిపికి ఓటమి తరువాత పార్టీ పరిస్థితి రోజురోజుకు మరింతగా దిగజారుతూ వస్తోంది. ఇప్పటికే పలు ముఖ్య ప్రాంతాల్లోని మంచి పట్టున్న నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇతర పార్టీలకు వెళ్లడం మొదలెట్టేశారు. అలానే రాను రాను పార్టీ అధిష్టానం నిర్ణయాలు పార్టీలోని కొందరు నేతలు పట్టించుకోకుండా వారి ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారని, కొందరు టిడిపి కార్యకర్తలు బహరింగంగానే చెప్పుకుంటున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం రాను రాను పార్టీ ప్రతిష్టను ఘోరంగా దెబ్బ తీస్తున్న ఈ ఘటనల పై అధినేత చంద్రబాబు ఎంతో నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారని, అలానే ఒక్కొక్కరుగా పార్టీ నేతలు బయటకు వెళ్లిపోవడం ఆయనకు పెద్ద తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. 

 

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాను మెల్లగా అధినేతగా తప్పుకుని, తన కుమారుడు లోకేష్ కి పార్టీ అధినేతగా పగ్గాలు అప్పగిస్తే మేలని చంద్రబాబు లోలోపల ఆలోచన చేస్తున్నట్లు కొన్ని రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీకి యువ రక్తం అవసరం అని, కావున ఇకనైనా లోకేష్ కి పూర్తి స్థాయిలో పగ్గాలు అప్పగించి, తాను వెనుక నుండి పర్యవేక్షణ చేస్తే తప్పకుండా మెల్లగా పార్టీ ప్రతిష్ట వృద్ధి చెందుతుందని ఆయన ఆలోచనట. అయితే ప్రస్తుత పలు రాజకీయ వర్గాల్లో విరివిగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక సమాచారం మాత్రం వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం, నందమూరి ఫ్యామిలీ నుండి ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయనేది వేచి చూడాలి......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: