ఇప్పుడున్న పరిస్దితుల్లో పదోతరగతి చదివిన వారిని చులకన చూస్తున్నారు. కనీసం మంచి ఉద్యోగం కూడా పది చదివిన వారికి దొరకడంలేదు. ఎక్కడైనా ఉద్యోగానికి అప్లై చేసుకుంటే మినిమం విద్యార్హత డిగ్రీ నుండే మొదలవుతుంది. ఒక్కప్పుడు గొప్పగా చెప్పుకున్న ఈ పదోతరగతి ఇప్పుడు ఎందుకు పనికిరానిది ఐయ్యింది.

 

 

కాని వీరికోసం కేవలం పది పాసైన వారికోసం ఒక ఉద్యోగ ప్రకటన వచ్చింది. అదెక్కడంటే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 'ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ & అలైడ్ స‌ర్వీసెస్ కంపెనీ లిమిటెడ్‌' సంస్థ కాంట్రాక్ట్ పద్ధతిలో దేశ‌వ్యాప్తంగా ఉన్న కార్యాల‌యాల్లో మల్టీటాస్కర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొంది.. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

 

ఇందులో ఉన్న మొత్తం పోస్టులు 283. వీటి కెటాయింపును గమనిస్తే సూరత్-07, భోపాల్-07, కోల్‌కతా-20, శ్రీనగర్-15, మధురై-18, తిరుపతి-18, వడోదర-18, రాయ్‌పూర్-18, ఉదయ్‌పూర్-18, రాంచీ-18, విశాఖపట్నం-18, ఇండోర్-18, అమృత్‌సర్-18, మంగళూరు-18, భువనేశ్వర్-18, అగర్తలా-18, పోర్ట్‌బ్లెయిర్-18. మొదలైన నగరాలకు గాను ఇలా విభజించారు. దీనికి అర్హతగా ప‌దోత‌ర‌గ‌తి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సంబంధిత ప‌ని స‌ర్టిఫికెట్లు, హిందీ, ఇంగ్లిష్‌తో పాటు స్థానిక భాష‌తో పాటుగా తగిన అనుభవం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు..

 

 

ఈ దరఖాస్తూ విధానాన్ని చూస్తే  అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ''AAI Cargo Logistics & Allied services Company Ltd.” పేరిట న్యూఢిల్లీలో చెల్లుబాటు అయ్యేలా డిడి తీయాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. డిడిపై అభ్యర్థి పూర్తి పేరు, ఫోన్ నెంబర్, పుట్టినతేది వివరాలను రాయాలి. ఇంట‌ర్వ్యూ ఆధారంగా సెలక్షన్స్ జరుగుతాయని తెలిపారు. సెలక్ట్ అయిన అభ్యర్దులకు జీతం నెలకు రూ.15,000- రూ.20,000.లతో పాటుగా  ఇతర అలవెన్సులు ఉంటాయి. ఇకపోతే ఈ దరఖాస్తూకు చివరి తేది 09.12.2019. 

మరింత సమాచారం తెలుసుకోండి: