54 లక్షల హెక్టార్లు...ఇంత విశాల‌మైన భూమే..మ‌హారాష్ట్రలో ఇప్పుడు మ‌నం చూస్తున్న మాయా రాజకీయానికి భీజం ప‌డింది. అదెలా?  బీజేపీ-శివ‌సేన స‌ర్కారు ఏర్పాట‌డానికి లింకేంటి? అని అనుకుంటున్నారా?.. అదే అస‌లు ట్విస్ట్‌. మహారాష్ట్రలో కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన కూటమి గద్దెనెక్కేందుకు సిద్ధమయ్యాయని ప్ర‌చారం జ‌రిగి హ‌ఠాత్తుగా థ్రిల్లింగ్ మ‌లుపు తిరిగి శ‌నివారం ఉద‌యం ఆ రాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫ‌డ్న‌వీస్,అజిత్ ప‌వ‌ర్ డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణం చేశారు.  దీనికంటే ముందే...మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం జ‌రిగింది. అదే పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్‌ పవార్‌ భేటీ జ‌ర‌గ‌డం. ముగిసింది.

 

పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీతో గురువారం ఎన్‌సీపీ అధినేత ప‌వార్ భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వీరిద్దరూ పలు అంశాలపై చర్చించారు. మోదీతో భేటీ ముగిసిన అనంతరం పవార్‌ మీడియాతో మాట్లాడుతూ... రైతు సమస్యలపైనే తాను ప్రధాని మోదీతో చర్చించానని. మహారాష్ట్ర రాజకీయాలపై మోదీతో చర్చించలేదు అని పవార్‌ స్పష్టం చేశారు. మహారాష్ట్ర రైతు సమస్యలపై ప్రధానికి 3 పేజీల లేఖను సమర్పించి వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మోదీని కోరిన‌ట్లు పవార్ తెలిపారు. మహారాష్ట్రలో 54 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వివ‌రించి...మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఉన్నందున కేంద్రం జోక్యం చేసుకోవాలని మోదీకి సూచించాన‌ని ...కేంద్రం తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని కోరాన‌ని  ఎన్సీపీ అధినేత వివ‌రించారు.

అయితే, ఈ భేటీలోనే...ప్ర‌స్తుత మ‌హామాయ‌ ప‌రిణామాలపై ప్ర‌ధాని మోదీ, ఎన్సీపీ ర‌థ‌సార‌థి ప‌వార్ మ‌ధ్య‌ చ‌ర్చ జ‌రిగింద‌ని తెలుస్తోంది. మహారాష్ట్ర రాజకీయాలపై మోదీతో చర్చించలేదు అని పవార్ చెప్పిన‌ప్ప‌టికీ...ఇదే ముఖ్య‌మైన చ‌ర్చ‌గా సాగింద‌ని...దాని ఫ‌లిత‌మే...రాత్రికి రాత్రి బీజేపీ-శివ‌సేన స‌ర్కారు ఏర్పాటు అని నిపుణులు పేర్కొంటున్నారు. మ‌రోవైపు ప‌వార్‌పై కొన‌సాగుతున్న వివిధ సంస్థ‌ల ద‌ర్యాప్తులు కూడా...స‌ర్కారు ఏర్పాటులో భాగ‌మ‌య్యాయ‌ని విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: