చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పటి మిత్రులు పవన్ మద్దతుతో 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక 2019 లో సీన్ మారింది పవన్ తమ జనసేన పార్టీ తో బరిలోకి దిగగా ప్రజలు ఘోరంగా తిరస్కరించారు. చివరికి పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఘోరంగా ఓడిపోయారు. ఇక టీడీపీ 23 సీట్లతో సరిపెట్టుకోగా, వైసీపీ ఘనవిజయం సాధించి అధికారం కైవసం చేసుకుంది. 

"ఇక వైసీపీ అధికారం చేపట్టిన దగ్గర నుంచి చంద్రబాబు మరియు పవన్ ఇద్దరూ వైసీపీ ఏది చేసిన తప్పే అన్నట్లు మాట్లాడుతారు కానీ ఏ ఒక్క రోజూ బాబు మరియు పవన్ ఒకరిని ఒకరు విమర్శించుకోరు తాము ఇద్దరూ ఒక్కటే" అంటూ విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. దీన్ని టీడీపీ నేతలు ఖండించడం కామన్. ఇక తాజాగా వైసీపీ నేతల విమర్శలకి బలం ఇస్తూ చంద్రబాబు మరియు పవన్ ఒకే విషయం పై ఒకే విధంగా ఒకే సారి స్పందించారు. 

విజయనగరంలో గాంధీ విగ్రహానికి జగన్ పార్టీ శ్రేణులు తమ పార్టీ జెండా రంగులు వేసిన విషయాన్ని బాబు ట్వీట్ రూపంలో పేర్కొంటూ నాడు టీడీపీ పార్టీ అధికారం లో ఉండగా ఇలాంటివి జరగలేదు అని పేర్కొన్నారు. సరిగ్గా ఇదే అంశాన్ని పవన్ కల్యాణ్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో మంత్రి బొత్స సత్యనారాయణ నియోజకవర్గం విజయనగరం లో ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ ట్వీట్ రూపంలో పోస్టు చేశారు. ఇద్దరూ ఒకే అంశంపై ఒకే సమయంలో స్పందించడం కాకతాళీయం అయివుండొచ్చు కానీ వైసీపీ శ్రేణులు మాత్రం బాబు, పవన్ తాము ఇద్దరం ఒకటేనని మళ్ళీ నిరూపించారని అంటున్నారు. ఈ వార్త కాస్తా సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఇక బాబు మరియు పవన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: