మహారాష్ట్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరిగాయి... అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమి మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లు సంపాదించింది. దీంతో మొదట బిజెపి శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం మరోసారి దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని మహా రాష్ట్ర ప్రజలు అందరూ భావించారు. కానీ ఇంతలో  శివసేన తమ పార్టీ నాయకుడికి సీఎం సీటు కావాలనే  డిమాండ్ ని తెర మీదికి తెచ్చింది. దీనికి  బిజెపి నిరాకరించడంతో బీజేపీతో శివసేన పోతును  విరమించుకుంది. దీంతో మహా ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే ఇక అప్పటి నుంచి మహా రాజకీయాల్లో రోజుకో మలుపు తిరుగుతుంది. రోజుకో కొత్త ట్విస్టు తెర మీదికి వస్తుంది. శివసేన ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీ నాయకుడిని సీఎం సీటులో కూర్చోబెట్టాలని ఎన్సీపీ కాంగ్రెస్ తో తీవ్ర కసరత్తు చేసింది. 

 

 

 

 శివసేన ఎన్సీపీ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్చలు ఓ కొలిక్కి రావడంతో శివసేన ఫేట్ మారిపోయింది శివసేన నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు అని శివసేన పార్టీ ఎన్నో కలలు కంది. అటు బిజెపి పార్టీ మాత్రం రాత్రికి రాత్రి పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు... మహారాష్ట్ర రాజకీయాలపై కూడా రాత్రికి రాత్రి సర్జికల్ స్ట్రైక్ చేసేసింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ వ్యూహాల ముందు శివసేన  వ్యూహాలు నిలబడలేకపోయాయి . దీంతో ఎన్సీపీ మద్దతును కూడా గట్టుకుంది  బిజెపి. శివసేన  పార్టీ నాయకుడీనే  సీఎం చేయాలని దృక్పదంతో ఉన్న శివసేన  పార్టీ ఎన్.సి.పి కాంగ్రెస్ పార్టీలతో చర్చలు కూడా ఓ కొలిక్కి రావడంతో ఆ పార్టీ నాయకుడు సీఎం అయినట్లేనని ఫిక్స్  అయిపోయింది.కానీ  శివసేన రాజకీయాలకు  రాత్రికి రాత్రే  చెక్ పెట్టి  బీజేపీ మహా సమీకరణాలను మారుస్తూ బిజెపి నేత దేవేంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు. 

 

 

 

 అసలు మహా రాజకీయాలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేసి అభివసేన పార్టీ కి భారీ షాక్ ఇచ్చింది బీజేపీ . శివసేన పార్టీ సీఎం సీటుపై పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లింది . బీజేపీ వ్యూహాలతో మహారాష్ట్రలో శివసేన పార్టీ పేట్  మొత్తం మారిపోయింది. చివరకు శివసేన కాంగ్రెస్ కి మద్దతు ప్రకటిస్తామన్న ఎన్సీపీ  పార్టీ రాత్రికి రాత్రి బీజేపీ కి మద్దతు  ప్రకటించింది. శివసేన పార్టీ ప్లేట్  మార్చడంతో శివసేన ఫేట్ మారిపోయింది. ఎవరూ ఊహించని విధంగా రాత్రికి రాత్రే ఎన్నో చర్చలు జరిపి తెల్లారేసరికి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా ఈ నెల 30 వరకు బలనిరూపణ చేసుకునేందుకు మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియారీ ... దేవేంద్ర ఫడ్నవిస్ కు అవకాశం కల్పించారు. అయితే ముందుగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతు  కూడగట్టుకున్న  బిజెపి ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కూడా బుజ్జగించి తమవైపు తిప్పుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: