నేటిరోజుల్లో ఒకరు చేసిన తప్పుకు మరొకరు శిక్ష అనుభవిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి. నిర్లక్ష్యం అనే మాట చిన్నదే కాని దాని చాటున ఎన్నో కుటుంబాల ఆవేదన దాగి ఉంటుంది. ఎందరో అమాయకుల జీవితాలు బలై పోతున్నాయి. ఇలాంటి చర్యల వల్ల చిన్నవయస్సులోనే  అనాధలైన వారుంటున్నారు. కాటికి వెళ్లే వయస్సులో మరణించిన ఆప్తులను, బిడ్డలను తలచుకుంటు రోధించే వారున్నారు.

 

 

ఒక నిర్లక్ష్యం ఎంత మందిని దిక్కులేని వారిని చేస్తూందో ఇప్పటికే ప్రపంచంలో జరిగే ప్రమాదాలను చూస్తుంటే తెలుస్తుంది. రాత రాసేవాడు బ్రహ్మ కాని ఆ తలరాతను చెరిపేది మాత్రం నిర్లక్ష్యమే. ఎవరో ముక్కు మోహం తెలియని వాడు చేసే తప్పువల్ల నిత్యం ఎందరో అభాగ్యులు కాటికి వెళ్లుతున్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే జరిగింది.

 

 

ఫ్లై ఓవర్ పై నుంచి కారు కిందపడిపోగా ఈ ప్రమాదంలో ఫ్లై ఓవర్ కింద నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ చనిపోగా.. మరో ఐదుగురు గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన బాధితుల్ని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ సంఘటన జరిగింది గచ్చిబౌలి బయో డైవర్సిటీ దగ్గర..

 

 

కాగా సమాచారం అందుకున్న పోలీసులు హూటాహుటిన ప్రమాద స్దలానికి చేరుకుని ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా తగిన చర్యలు చేపట్టారు. అంతే కాకుండా ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కారు ఓవర్ స్పీడ్ వల్ల ప్రమాదం జరిగిందా.. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

 

 

అందుకు గాను ప్రత్యక్ష సాక్షులను  అడిగి ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఇకపోతే బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై ఈ వారంలో వరుసగా రెండో ప్రమాదం జరగడం వాహనదారులను ఆందోళనకు గురిచేస్తుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: