నారా లోకేష్ కు షాకింగ్ న్యూసే ఇది. గుంటూరు జిల్లా సమీక్షా సమావేశాల్లో లోకేష్ పాల్గొనకుండా బహిష్కరణ వేటు పడింది. జగన్మోహన్ రెడ్డిని సైకో అంటూ లోకేష్ ఈమధ్య వ్యాఖ్యానించిన విషయం అందరికీ తెలిసిందే. జగన్ పై కామెంట్ చేసిన నారావారి పుత్రనత్నం తన ట్విట్టర్ ఖాతాలో సైకో సిఎం అంటూ ఎగతాళి చేశారు. సిఎంనే సైకో సిఎం అంటూ ట్వీట్ చేసిన లోకేష్ ను జిల్లా సమీక్షా సమావేశాల్లో పాల్గొనకుండా బహిష్కరించాలని సమావేశం తీర్మానించింది.

 

నిజానికి జగన్ పై లోకేష్ నోటికొచ్చినట్లు కామెంట్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఆ కామెంట్లు సృతిమించి నట్లుంటున్నాయి. అయినా జగన్ తరపునుండి ఎప్పుడూ పెద్దగా వ్యతిరేకత కానీ అభ్యంతరాలు కానీ రాలేదు. దాంతో లోకేష్ మరింత రెచ్చిపోతున్నారు. అసలు లోకేష్ పెట్టే ట్వీట్లు సిఎం దృష్టికి వెళుతున్నాయో లేదో కూడా తెలియటం లేదు. అయినా సిఎంపై తనకున్న అక్కసంతా టిడిపి ఎంఎల్సీ తన ట్విట్టర్లో తీర్చేసుకుంటున్నారు.

 

అయినదానికి కాని దానికి కూడా ఎంఎల్సీ జగన్ కు ముడేసి తన శాడిజాన్ని తీర్చేసుకుంటున్నారు. వరదల కారణంగా ప్రకాశం బ్యారేజిలో ఓ నాటు పడవ తూములకు అడ్డంపడితే దాన్ని కూడా సిఎంకు ముడేసి నోటికొచ్చినట్లు కామెంట్లు పెట్టారు.  ఏరోజు లోకేష్ ట్విట్టర్ ఖాతాలో చూసినా సిఎంను టార్గెట్ చేస్తు కామెంట్లు ఉండాల్సిందే.

 

వరదల సమయంలోనే ఓ రైతు సిఎంను విమర్శించినట్లు  మహిళలు సిఎంను దుర్భాషలాడినట్లు పెద్ద పెద్ద కామెంట్లతో పాటు వాళ్ళు మాట్లాడిన వీడియో, ఆడియోలను కూడా తన ట్విట్టర్ ఖాతాలకు జత చేసి పబ్లిసిటీ ఇచ్చిన విషయం అందరూ చూసిందే. కాకపోతే ఆ తర్వాతే వాళ్ళంతా రైతులు కారని టిడిపి పెయిడ్ ఆర్టిస్టులని బయటపడింది. సరే ఇలా చెప్పుకుంటూ పోతే లోకేష్ ట్విట్లో గోల చాలానే ఉంటుంది.

 

మొత్తానికి జగన్ ను సైకో అని అన్నందుకు జిల్లా సమీక్షా సమావేశాల నుండి బహిష్కరించాలని వైసిపి మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రతిపాదించారు. దానికి మెజారిటి సభ్యులు మద్దతు తెలిపారు. దాంతో ఇకనుండి లోకేష్ ను డిఆర్సీ సమావేశాల్లో పాల్గొనకుండా బహిష్కరిస్తున్నట్లు సమావేశం తీర్మానించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: