మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగిన సంగతీ తెలిసిందే. ఎవరు ఊహించని విధంగా బీజేపీ తెర వెనుక పావులు కదిపి తెల్లారేసరికి బీజేపీ అభ్యర్థిగా ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వచ్చిన వెంటనే అక్కడ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకున్న కమలనాథులు... చాలా పకడ్బందీగానే ప్లాన్ బీని రచించుకున్నారు. ఈ తరహా కొత్త ప్లాన్ కు మొన్నామధ్య కర్ణాటకలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మరోమారు గుర్తు చేసుకున్న తర్వాతే బీజేపీ ఈ ప్లాన్ బీని రచించినట్లుగా కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంటే... మహారాష్ట్రలో అధికారం చేజారకుండా ఉండటానికి కర్ణాటకలో తనకు ఎరుదైన అనుభవాలను ఆధారం చేసుకుని బీజేపీ నేతలు ప్లాన్ బీకి పథక రచన చేశారన్న మాట.


 
కర్ణాటకలో ఇదే మాదిరిగా బీజేపీ సీఎం కుర్చీని మొదట్లో అందుకోలేకపోయింది. కన్నడ నాట ఏం జరిగిందన్న విషయానికి వస్తే... మహారాష్ట్ర మాదిరిగానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సంఖ్యలో మాత్రం సీట్లను గెలవలేకపోయింది. ఈ క్రమంలో జేడీఎస్ కాంగ్రెస్ ల నుంచి రెబెల్స్ ను లాగేయాలని చూసినా అక్కడ కుదరలేదు. అంతేకాకుండా... బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వరాదన్న భావనతో కాంగ్రెస్ నెరపిన మంత్రాంగంతో సీఎంగా ప్రమాణం చేసినా బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప బల నిరూపణకు ముందే రాజీనామా చేయక తప్పలేదు. అయితే యడ్డీ రాజీనామా తర్వాత కొలువుదీరిన జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ సర్కారును కూల్చి మరోమారు యడ్డీని అక్కడ సీఎంగా కూర్చోబెట్టడానికి బీజేపీకి చాలా కాలమే పట్టింది.

 

దీనితో బీజేపీ కర్ణాటకలో రిపీట్ అయినా సీన్ మహారాష్ట్రలో రిపీట్ కాకూడదని పధక రచన చేసింది. ఈ మొత్తం వ్యవహారంతో బీజేపీ చాలానే పాఠాలు నేర్చుకుందని కూడా చెప్పక తప్పదు. కర్ణాటకలో మాదిరే మహారాష్ట్రలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీనే అవతరించినా... సీఎం కుర్చీ చెరి సగం అంటూ శివసేన కొత్త రాగం అందుకోవడంతో... బీజేపీ నేతలు అలర్ట్ అయిపోయారు. మంకుపట్టుతో ముందుకు సాగే శివసేన ఎలాగూ అంత ఈజీగా దారికి రాదన్న భావనతోనే... శివసేన తనతో కలిసి రాకుంటే... ఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నా కీలకంగా మారిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యేలపై బీజేపీ దృష్టి సారించింది. ఎన్సీపీలో చీలిక తెస్తే.. మహారాష్ట్ర సీఎం పీఠం తమ నుంచి దూరం కాదన్న పక్కా అంచనాలతోనే బీజేపీ చాలా సైలెంట్ గానే పథక రచన చేసినట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: