జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనను గాడిలో పడింది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నో సంక్షేమ,  అభివృద్ధి పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తూ పాలనలో తనదైన మార్కును ప్రదర్శిస్తు ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి . ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచేలా పాలన  కొనసాగిస్తున్నారు. ఇక జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు నడుంబిగించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పేద విద్యార్థులు అందరికీ మెరుగైన విద్య అందుబాటులో ఉండేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే  అమ్మఒడి  పథకానికి ఊపిరి పోసింది జగన్ సర్కార్. 

 

 రాష్ట్రంలోని పేద విద్యార్థులు అందరూ పాఠశాలలకు వెళ్లి చదువుకోవాలనే  ఉద్దేశంతో అమ్మఓడి  పథకానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పేద విద్యార్థులందరు  స్కూలుకు వెళ్లలా ప్రతి ఏటా  15 వేల రూపాయల చేయూతను  అందించేందుకు నిర్ణయుంచింది  జగన్ సర్కారు.దీనికి  సంబంధించిన కార్యాచరణను రూపొందించారు. అయితే ఇప్పటికే అమ్మ ఒడి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలందరికీ వెబ్ సైట్ ను  కూడా అందుబాటులో ఉంచింది జగన్ సర్కార్. 

 

 అమ్మఒడి  వెబ్ సైట్ లో  సమస్యలు ఉన్నాయని ఉపాధ్యాయులు తెలుపుతున్నారు. అమ్మ వెబ్ సైట్ లో  సమస్యల కారణంగా లబ్ధిదారులు అమ్మఒడి  పథకానికి నమోదు చేసుకోలేకపోతున్నారు అని  ఉపాధ్యాయులు అంటున్నారు. అందువల్ల అమ్మఒడి  పథకానికి  నమోదు కోసం గడువు  పెంచాలంటూ... ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్  ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి పి రవి ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. సర్వర్ లో  లోపాల కారణంగా రాష్ట్రంలోని సర్కార్ బడులు ప్రధానోపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడుతున్నారు అంటూ ఆయన వెల్లడించారు. సర్వర్  సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: