సుభిక్షంగా సాగుతున్న రాజ్యంలోకి ఆశ అనే అనుకోని అతిధి వచ్చాడు అతడు ఏ ఆలోచనతో వచ్చాడో ఎవరికి తెలియదు. కాని అతను వేసిన ఎత్తువల్ల దక్కుతుందనుకున్న రాజ్యం చేజారి పోయింది. అతన్ని నమ్మిన వారు దారుణంగా కష్టాల పాలు అయినారు. కాని ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆ అతిధిని పంపింది ఆ రాజ్యాన్ని పాలించే రాజు అని కొందరికి అనుమానం వస్తుందట. ఎందుకంటే తన ఉనికిని కాపాడుకోవడానికి అందరికి మేలు చేస్తున్నట్లుగా ఉన్న ఆ అతిధి సడెన్‌గా రూటు మార్చి పోరాటానికి తగ్గ ప్రతిఫలం అందకుండానే వెనక్కి తిరిగాడట.

 

 

ఈ విషయం మన తెలంగాణ ఆర్టీసీ సంస్దకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఎలాగోలా నెట్టుకొస్తున్న ఆర్టీసీని ఆ సంస్ద ఉద్యోగులను ఇప్పుడు రోడ్డున పడేసిన పాపం ఎవరిదంటే భుజాలు తడుముకునే పరిస్దితులో ఉన్నారు. అసలు సమ్మె మొదలు పెట్టడమే తప్పుడు సమయంలో మొదలు పెట్టారు. మరి ఈ ఆలోచన కార్మిక సంఘాలే చేశాయా. లేక ఈ సమ్మె వెనుక ఎవరి హస్తం అయినా ఉందా అనే ఆలోచనలు ఇప్పుడు కార్మికుల్లో రేకెత్తిస్తున్నాయి.

 

 

ఒక యుద్దంలోకి సైనికుడు వెళ్లాడంటే విజయమో, వీర స్వర్గమో తేల్చుకుంటాడు. కాని ఇక్కడ ఏది తెగకుండానే సమ్మె పూర్తిగా నీరుకారినట్టుగా అనిపిస్తుంది. నిప్పు రాజుకున్నప్పుడు వచ్చే మంటవల్ల పుడుతున్న వేడి ఆ నిప్పు ఆరాక ఉండదు. ఎందుకంటే దాదాపు 52 రోజుల నుండి చేస్తున్న సమ్మెలో ఇప్పటివరకు ఓ నిర్ణయానికి రాని ప్రభుత్వం ఇక వస్తుందనే ఆశ చాల మందికి చచ్చిపోయింది. దీనికి తగ్గట్టుగానే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని దృడంగా సంకల్పించుకున్నట్లుగా ఉన్నారు కేసీయార్. ఈ దశలో అసలు వేర్లు అంటు లేని చెట్టుకు ఎన్ని నీళ్లు పోసి బ్రతికించాలని చూసిన అది బ్రతకడం అసాధ్యం అన్న విషయాన్ని ఎందుకు ఎవరు గ్రహించి ప్రత్యామ్నాయంగా ముందుకు వెళ్లడం లేరో అర్ధం కాని స్దితిలో కార్మికులు ఉన్నారు.

 

 

ఇప్పటికే సామాన్యుడి నడ్డి మొత్తం విరిగి బాధపడుతున్న సమయంలో పడరాని పిడుగు, వినకూడని వార్త మీదపడితే కోలుకోవడం కష్టం అని అనుకుంటున్నారు. ఇకపోతే సమ్మెలు, రాస్తారోకోలు, ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తే సమస్య పరిష్కారామవుతుందా అని కార్మిక సంఘ నాయకులు ఒక్క సారి ఆత్మవిమర్శ చేసుకోవాలని ఈ సమ్మె వల్ల నష్టపోయిన బాధితులు లోలోన అనుకుంటూ తపించిపోతున్నారు. ఇకపోతే సోమవారం ఈ అంశంపైనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

 

 

కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ కార్మిక జేఏసీ చేసిన ప్రకటనపై ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు. ఈ అంశంపై ప్రభుత్వ వైఖరి కోసం సమ్మెలో కొనసాగుతున్న కార్మికులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. దీనిపైనా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

 

 

ఇప్పటికే జరుగుతున్న కాలయాపనతో ఆర్టీసీ సంస్ద గాని అందులో పని చేస్తున్న కార్మికులు గాని, ప్రజలు గాని పడుతున్న వేదనను ఎందుకు అర్ధం చేసుకుంట లేరో నాయకులు. ఇదే కాకుండా తెలంగాణ ఆర్టీసీ సంస్ద మూసుకుపోవడానికి సమయం ఎన్నిరోజులో లేదని అనుకుంటున్నారు కొందరు. మొత్తానికి ఇక్కడి విషయాలను లోతుగా పరిశీలిస్తే ఎన్నో నమ్మలేని నిజాలు బయటపడవచ్చూ అని అనుకుంటున్నారు మొదటినుండి సమ్మె జరుగుతున్న విధానాలను గమనిస్తున్న సామాన్య ప్రజలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: