ఒక ఆలోచన పదిమంది ప్రాణాలను నిలిపితే, ఒకరికి వచ్చే ఆవేశం పదిమంది ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడదంటారు. సమస్య పెద్దదైనప్పుడు ఆలోచన కూడా అదేవిధంగా చేయాలి లేకుంటే ఇదిగో ఇలా ప్రాణాలు తీసుకోవలసిన విధంగా ముందుకెళ్లుతారు. ముఖ్యంగా ఆత్మస్దైర్యం లోపించకుండా చూసుకోవాలి. లేకపోతే అనంతలోకాలకు వెళ్లవలసి వస్తుంది.

 

 

ఈ మద్య జరుగుతున్న ఆత్మహత్యలు ఫ్రూఫ్ కుడా చేస్తున్నాయి. ఇక ఇప్పుడొక సింగర్ కూడ ఆవేశపడ్డదో లేక ఆత్మస్దైర్యం లోపించిందో తెలియదు గాని అనుమాన స్పదంగా మరణించింది వివరాలు తెలుసుకుంటే దక్షిణ కొరియాకు చెందిన కే-పాప్‌ బ్యాండ్‌ ‘కారా’ సభ్యురాలిగా, గాయనిగా పేరొందిన గూ హరా ఆదివారం సియోల్‌లోని తన ఇంట్లో అనుమానాస్పదస్థితిలో విగతజీవిగా కనిపించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆమె తన ఇంట్లో మరణించి ఉండటాన్ని పరిచయస్తులు గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఆయితే ఆమె మృతికి కారణాలు తెలియదని, ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చునని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.

 

 

ఇకపోతే ఇదే విధంగా ఆరు నెలల కిందట కూడా గూ హరా అపస్మారక స్థితిలో కనిపించగా వెంటనే ఆమె మేనేజర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించగా డాక్టర్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందని తెలిపారట. ఆ తర్వాత కోలుకున్న ఆమె... తన ఫ్యాన్స్‌కి క్షమాపణలు కూడా చెప్పింది. ఇక 2008లో సొంతంగా ‘కారా’ బ్యాండ్‌ గర్ల్‌గా గూ హరా సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పట్లో కారా బ్యాండ్‌ గ్రూప్‌ సెన్సేషనల్‌ పాపులారిటీని సొంతం చేసుకుంటున్న సమయంలో ఏమైందో తెలియదు గాని  క్రమంగా ఈ బ్యాండ్‌ ప్రభ మసకబారింది. ఈ క్రమంలో గత ఏడాది రివేంజ్‌ పోర్నోగఫీ బారిన పడిన గూ హరా తన మ్యూజిక్‌ కెరీర్‌ను అర్ధంతరంగా ఆపేసింది.

 

 

మాజీ ప్రియుడు తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తిగత వీడియోలను బయటపెడతానని బెదిరించడతో ఈ విషయం పై అతన్ని కోర్టుకు ఈడ్చింది హరా. దీంతో కోర్టు అతనికి తాత్కాలిక జైలుశిక్ష విధించింది. ఈ వీడియోల కారణంగానే ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇకపోతే దక్షిణ కొరియాలో చాలా మంది మోసగాళ్లు అమ్మాయిలతో ఏకాంతంగా ఉన్న సమయంలో సీక్రెట్‌గా వీడియోలు తీసి వెబ్‌సైట్లకు అమ్ముకుంటున్నారు. దీన్ని స్థానికంగా మోల్కా అనే పేరుతో  పిలుస్తున్నారు.

 

 

ఇలాంటి మోల్కా కేసులు  2017లో 6400 బయటపడ్డాయి. 2012లో 2400 కేసులు నమోదయ్యాయి. గత నెల్లో ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. ఎందుకంటే  ఆమె ఓ హాస్పిటల్‌లో బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఎవరో సీక్రెట్ గా  ఆ దృష్యాలను తీసి,  పోర్న్ సైట్లకు అమ్మేశారట.

 

 

ఇప్పటికే ఈ విధానంపై చాలా మంది ఆందోళనలు చేపట్టి ఇలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దశాబ్దకాలంలో సౌత్ కొరియాలో చాలా మంది సెలబ్రిటీలు ఇలాగే ప్రాణాలు తీసుకున్నారు. దీన్ని బట్టీ... సౌత్ కొరియాలో కే-పాప్ స్టార్ల పరిస్థితి ఏమీ బాగోలేదనీ, అక్కడి పోర్న్ ఇండస్ట్రీ... వాళ్ల ప్రాణాలపైకి తెస్తోందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: