గతంలో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్సీపీ ఎల్పీ నేతగా ఉన్న అజిత్ పవార్ పై 72 వేల కోట్ల సాగునీటి  కుంభకోణంలో  చిక్కుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో 72 వేల కోట్ల కుంభకోణం లో అజిత్ పవార్ పై కేసు నమోదు కావటం   సంచలనంగా మారింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్సీపీ ఎల్పీ నేతగా ఉన్న అజిత్ పవార్ ను అరెస్ట్ చేస్తామని గతంలో బిజెపి ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే తాజాగా 72వేల కోట్ల సాగునీటి కుంభకోణంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు ఊరట లభించింది. ఈ కుంభకోణం కేసులో  ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు క్లీన్ చిట్ ఇచ్చింది అవినీతి నిరోధక శాఖ. ఈ కుంభకోణంలో అజిత్ పవార్ కు క్లీన్ చిట్ ఇస్తూ... ఈ కేసు  విచారణ ముగిస్తున్నట్లు ప్రకటించింది.ప్రస్తుతం ఈఅంశం మహా రాజకీయాల్లో సంచలనంగా మారింది. గతంలో ఈ కేసు విషయంలో అజిత్ పవార్ ను  అరెస్టు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రస్తుతం అజిత్ పవార్ క్లీన్ చీట్ ఇస్తూ  ఈ కేసు విచారణ ముగిస్తున్నట్లు ప్రకటించటం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

 

 

 

 మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అజిత్ పవార్ మద్దతు ప్రకటించడం వల్లే బిజెపి అజిత పవార్ కు 72 వేల కోట్ల కుంభకోణం లో క్లీన్ చీట్ ఇచ్చి  ఆ కేసును మూసివేసారూ అంటూ  విమర్శలు వస్తున్నాయి. తమకు మద్దతు ప్రకటించిన ఒక్కరోజులోనే అజిత్ పవార్ పై  ఉన్న కుంభకోణం కేసును  తొలగించడం ప్రస్తుతం మహా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే సాగునీటి కుంభకోణంలో క్లీన్చిట్ ఇవ్వడంపై ఎన్సీపీ శివసేన పార్టీలు బిజెపి ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నాయి. అజిత్ పవార్ కు ఇలాంటి హామీలు బిజెపి పార్టీ ఇవ్వడం వల్లె అజిత్ పవార్ మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్దతు ప్రకటించారని ఆరోపిస్తున్నాయి. 

 

 

 

 అంతేకాకుండా అజిత్ పవార్ కు కుంభకోణం కేసులో  క్లీన్ చిట్ ఇవ్వడంపై కూడా విభిన్న  ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి మద్దతు తెలిపితే మిగతా పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను కూడా ఇదే మాదిరిగా కొట్టివేసే అవకాశం ఉందంటూ  మహా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బిజెపికి మద్దతు తెలిపిన వారికి భారీ హామీలు ఇస్తుంది అని తెలుపడానికి అజిత్ పవన్ కు భారీ కుంభకోణంలో క్లీన్చిట్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బలనిరూపణ చేసుకునేందుకు 24 గంటల సమయం మాత్రమే ఇచ్చిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన 24 గంటల సమయంలో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని సూచించింది. దీంతో ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: