అనుకున్నదంతా అయ్యింది. ఒక సమస్య ముగిసిందనుకునే లోపే మరో సమస్య ముదిరింది. ముందు నుండి అనుకున్నట్లే ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడే పరిస్ది వచ్చింది. ఎంతగా చెబుతున్న వినకుండా సమ్మెకు దిగిన వారి పరిస్దితి ఇప్పుడు ఆగమ్యగోచరంగా మారింది. సమ్మె విషయంలో తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్టీసీ తాత్కాలిక ఎండీ సునీల్ శర్మ స్పష్టమైన ప్రకటన చేశారు.

 

 

అదేమంటే సమ్మె విరమించినా కార్మికులను విధుల్లోకి తీసుకునేది లేదని స్పష్టం చేసింది. సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ కార్మికులు చేసిన ప్రకటనపై స్పందించిన సునీల్ శర్మ.. కార్మికులను విధుల్లోకి తీసుకోకూడదని ఆర్టీసీ నిర్ణయించినట్లు తెలిపారు. పండుగ సమయాల్లో అనాలోచిత సమ్మె చేశారని జేఏసీ నిర్ణయం హాస్యాస్పందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల నిర్ణయాన్ని సునీల్ శర్మ తప్పుపట్టారు. ఇదే కాకుండా ఈ సమయంలో సమ్మె విరమణ ప్రకటనను కూడా సునీల్ శర్మ తప్పుపట్టారు.

 

 

జేఏసీ నాయకులు ఓవైపు పోరాటం కొనసాగుతుందని చెబుతూనే.. మరోవైపు సమ్మె విరమణ అంటున్నారని మండిపడ్డారు. కార్మికులు ఇష్టమొచ్చినట్లు విధులకు గైర్హాజరై మళ్లీ విధుల్లోకి చేరుతారా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ గానీ, ప్రభుత్వం గానీ సమ్మె చేయమని చెప్పలేదన్నారు. కార్మికులు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారని అన్నారు. దీనిపై కార్మికశాఖ కమిషనర్ సరైన నిర్ణయం తీసుకుంటారని అంతా చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం జరుగుతుందని పేర్కొన్నారు.

 

ఇప్పుడు అన్ని వేయిల కుటుంబాల పరిస్దితి ఏంటనే ప్రశ్న ప్రతి వారిలో మెదులుతుంది. ఇప్పటికే సమ్మె వల్ల కొన్ని కుటుంబాలు రోడ్దున పడ్డాయి. ఇంకా మరెన్ని కుటుంబాలు వీధిన పడతాయో తెలియని దుస్దితి తెలంగాణాలో నెలకొంది. ఇన్ని వేయిల మంది ఏ నమ్మకంతో ఈ సమ్మెకు దిగారో ఇప్పుడు కనిపిస్తున్న పరిస్దితిలో ఆలోచించుకుని ఉపయోగం లేదని పిస్తుంది. ఇక ఈ సమ్మెకు దిగే ముందు ఇంతలా ఎవరిని నమ్మి కార్మికులు తమ ఉద్యోగాలను తాకట్టు పెట్టారో అర్దం అవడం లేదు. కాని ఇప్పుడు ఏ నాయకుడిచ్చిన హమీ పనిచేయడం లేదు. ఇకపోతే ఆ కార్మికుల భవిష్యత్తును కాపాడేవారెవరున్నారో తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: