గత 52 రోజులుగా కొనసాగిన ఆర్టీసీ సమ్మె నేటితో తెర పడింది. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన చేశారు. రేపటి నుండి ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు కావాలని, ప్రైవేట్ కార్మికులు విధుల నుండి వెళ్లిపోవాలని అశ్వత్థామరెడ్డి సూచించారు. ఇది కార్మికుల నైతిక విజయం అని అశ్వత్థామరెడ్డి అన్నారు. 

 

తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె విరమిస్తున్నట్లు అశ్వత్థామరెడ్డి ప్రకటన చేశారు. విధుల్లో చేరి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొనివస్తామని అశ్వత్థామరెడ్డి చెప్పారు. ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేయటానికి ప్రయత్నాలు చేస్తోందని ప్రైవేటుపరం చేయడాన్ని అడ్డుకోవడానికి, ఎదుర్కోవడానికి ప్రభుత్వం స్పందించినా, స్పందించకపోయినా కార్మికులందరూ డిపోలకు వెళ్లి విధులను నిర్వహించాలని యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొనిరావాల్సి ఉందని అన్నారు. 

 

 అయితే అటు ఆర్టీసీ తగ్గి మల్లి విధుల్లోకి చేరడానికి కార్మికులు వస్తామన్న కూడా ప్రభుత్వం వారిని మళ్ళి విధుల్లోకి తీసుకోడానికి రెడీగా లేము అన్నట్టు ఉంది. చేతులెత్తినా సరే ప్రభుత్వం ససేమిరా అంటుంది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. దీంతో ఆర్టీసీ కార్మికుల విషయంలో గందరగోళం ఏర్పడింది. 

 

సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటన హాస్యాస్పదమని సునీల్ శర్మ వ్యాఖ్యానించారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మెకు వెళతాం.. ఇష్టం మొచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే కుదరని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ప్రజలను ఎంతో ఇబ్బంది పెట్టారని అయన గుర్తు చేశారు. అంతే కాదు ఈ సమ్మె వల్ల ప్రభుత్వానికి ఎంతో నష్టం చేకూరిందని అయన అన్నారు. 

 

హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంలో కార్మిక శాఖ కమిషనర్ తగు నిర్ణయం తీసుకుంటారని ఆ నిర్ణయం బట్టే ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు ఉంటాయని అయన చెప్పారు. అంతే కాదు రేపు డిపోల వద్దకు వెళ్లి ప్రైవేట్ డ్రైవర్లను, కండక్టర్లను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని సూచించారు. మరి రేపు రాష్ట్రంలో ఎలా ఉండబోతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: