బీజేపీ కేంద్రంలో రెండవసారి అధికారంలోకి రావడం కాదు కానీ మునుపెన్నడూ లేని విధంగా దూకుడును ప్రదర్శిస్తోంది.  ఇపుడు కాకపోతే మ‌రెప్పుడు అంటూ దూసుకుపోతోంది. నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ ఇద్దరు కమల రధాన్ని పరుగులు తీయిస్తున్నారు. వారి చూపు ఇపుడు అక్కడ పడిందట. దాంతో గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. అందుకు డెడ్ లైన్ కూడా పెట్టేశారు.

 

ఏపీలో బీజేపీ కండువాల కార్యక్రమం తొందరలో మొదలవుతోంది. ఇప్పటివరకూ గుర్తించిన పెద్ద తలకాయలందరికీ ఒకేమారు పార్టీ కండువాలు కప్పేస్తారట. ఏపీలో కొత్త సర్కార్ ఏర్పడి ఆరు నెలలు అయింది. బీజేపీకి మాత్రం బోణీ ఒక్కటీ పడలేదు.  ఇక ఆ పార్టీ నేతలు చేరుతున్నారు, వీరు వస్తున్నారు అంటూ బోల్డ్ గా స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్ప జరిగింది ఏదీ లేదు.

 

దాంతో హై కమాండ్ నేరుగానే రంగంలోకి దిగుతోందట. డిసెంబర్లో ఏపీలో బీజేపీ అగ్ర నేతల టూర్లు ఉంటాయని అంటున్నారు. ఈ లోగా వివిధ పార్టీల నుంచి గుర్తించిన నేతలను, ఎమ్మెల్యేలను కూడా కమలం గూటికి చేర్చే బాధ్యతను ఏపీ నేతలకు అప్పగించారు. మాటలు కట్టిబెట్టి  చేతల్లో సత్తా చూపించమని హై కమాండ్ ఆదేశించిందని టాక్.

 

టీడీపీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వస్తారని ఓ వైపు ప్రచారం సాగుతోంది. మరి వారిని బీజేపీలోకి లాగేసుకునేందుకు డిసెంబర్ ముహూర్తంగా పెట్టారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే సమయంలో ఇతర పార్టీలకు కూడా కాషాయం పార్టీ నేతలు గాలం వేస్తున్నారు. దీంతో ఏపీలోని నాయకులు వేటలో పడ్డారు. మరి బీజేపీలో చేరేందుకు  ఎవరు ముందుకు వస్తారో, వారికి ఆ పార్టీ ఇచ్చే తాయిలాలు ఏంటో మొత్తం కధ డిసెంబర్లో తేలిపోతుంది. అంటే డిసెంబర్లో ఏపీలో రాజకీయ ప్రకంపనలేనన్నమాట. చూడాలి మరి ఏపీ రాజకీయ ఏ మలుపులు తిరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: