చంద్రబాబునాయుడు కలలుకంటున్న అమరావతికి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చెక్ పెట్టేశారు. అనవసరమైన ఆర్భాటాలు అవసరం లేదని తేల్చి చెప్పేశారు. రాజధాని నిర్మాణాలను గ్రాఫిక్స్ లో కాకుండా వాస్తవ నిర్మాణాల్లో చూపాలన్నది జగన్ ఆలోచనగా స్పష్టమవుతోంది. అందుకనే  ప్రాధాన్యత క్రమంలో నిర్మాణాలను మొదలుపెట్టమని సిఆర్డీఏ ఉన్నతాధికారులను  ఆదేశించారు.

 

అమరావతి పరిధిలో నిలిచిపోయిన నిర్మాణాలపై జగన్ సమీక్షించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్లకు, సగంలో నిలిచిపోయిన నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అలాగే రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు కూడా అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాలని కూడా చెప్పారు.

 

ఇంతకాలం రాజధాని నిర్మాణంపై జగన్ నిర్లక్ష్యం చూపుతున్నారని, అమరావతి అభివృద్ధిని జగన్ చంపేశాడని చంద్రబాబునాయుడు అండ్ కో నెత్తి నోరు మొత్తుకుంటున్న విషయం అందరూ చూస్తున్నదే. నిజానికి చంద్రబాబు, ఎల్లోమీడియా చెబుతున్నంతగా అక్కడ నిర్మాణాలు జరిగలేదు, అమరావతి అభివృద్ధీ జరగలేదు.

 

అమరావతి నిర్మాణమంతా గ్రాఫిక్స్ లోను, ఎల్లోమీడియాలోనే జరిగంది. దాన్నే నిజమైన అభివృద్ధని, రూ 2 లక్షల కోట్ల సంపదను సృష్టించాననే తలతిక్క మాటలు చెబుతున్నారు చంద్రబాబు. చంద్రబాబు చెబుతున్నదే నిజమైతే మరి తన ఐదేళ్ళ పాలనలో రూ. 2.7 లక్షల కోట్లు అప్పు ఎందుకు చేసినట్లు ? లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించిన తర్వాత కూడా అన్ని లక్షల కోట్ల అప్పులెందుకు అవుతాయి ?

 

అందుకనే చంద్రబాబు ఏమి మాట్లాడుతున్నా జగన్ మాత్రం తనపనేదో తాను చేసుకుని వెళుతున్నారు. ఇందులో భాగంగానే అసంపూర్తిగా ఉన్న పనులు, 50 శాతం వద్ద నిలిచిపోయిన పనులను వెంటనే మొదలుపెట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. ఒకసారంటూ పనులు మొదలైతే వీలైనంత తొందరలోనే పూర్తి చేయటానికి జగన్ ప్లాన్ చేస్తారన్నది అందరికీ తెలిసిందే. అలాగే రైతులకు కూడా అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇచ్చేస్తే రైతుల సమస్యలు కూడా దాదాపు పూర్తయినట్లే. అపుడిక చంద్రబాబు, ఎల్లోమీడియా నోళ్ళు లేచేందుకు కూడా లేదు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: