ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం సహా మిగతా డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలుపెట్టారు. ఒక డిమాండ్ కూడా పరిష్కారం కాకుండానే 52 రోజుల తర్వాత సమ్మె విరమిస్తున్నామని ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని సమ్మె విరమణ  ప్రకటన చేశారు. అయితే ఆర్టీసీ జేఏసీ  పంపిన సమ్మె విరమణ ప్రకటనను  మాత్రం ఆర్టీసీ యాజమాన్యం తిప్పి  పంపింది.  ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకుని ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. అటు ఆర్టీసీ కార్మికులు మాత్రం రేపు ఉదయం  తాము ఎట్టి పరిస్థితుల్లో విధుల్లో  చేరుతారంటూ తేల్చి చెప్పారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులు వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోమంటు  స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద భారీ పోలీసు బలగాలు మోహరించారు. 

 

 

 

 సమ్మె విరమించిన కార్మికులందరూ విధుల్లోకి చేరేందుకు వచ్చి  శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందంటూ భారీకేడ్లను  ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించింది . మరోవైపు ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు తరలివస్తున్నారు. దీంతో రాష్ట్రం  లోని అన్ని డిపోల వద్ద పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.ఈ క్రమంలో  రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద 144 సెక్షన్ విధించారు పోలీసులు. విధుల్లో చేరటానికి  వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు  విధుల్లో చేరకుండా అడ్డుకోవటంతో   పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు కార్మికులు . 

 

 

 

 దీంతో రాష్ట్రంలోని పలు డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కరీంనగర్ ఖమ్మం కామారెడ్డి మెదక్ రంగారెడ్డి నల్గొండ సిద్దిపేట మహబూబ్నగర్ డిపోల వద్ద విధుల్లోకి చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికుల అరెస్టులు కొనసాగుతున్నాయి . మహబూబ్ నగర్ హైదరాబాద్ డిపోల వద్ద మొత్తం 73 మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు  తరలించారు. ఇక సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం విధుల్లోకి తీసుకోకపోవడంపై ఆర్టీసీ జేఏసీ  ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆర్టీసీ కార్మికులను ఎందుకు విధుల్లోకి చేర్చుకోవడం లేదో  లిఖితపూర్వకంగా సమాధానం  ఇవ్వాలంటూ డిపో మేనేజర్ లని డిమాండ్ చేస్తోంది ఆర్టీసీ జేఏసీ. 

 

 

 

 అయితే ఆర్టీసీ సమస్యపై విచారించిన హైకోర్టు ఆర్టీసీ సమ్మె లేబర్ కోర్టులో తేల్చుకోవాలని  తెలిపిన విషయం తెలిసిందే. అయితే లేబర్ కోర్టులు ఆర్టీసి సమ్మె పై స్పష్టత వచ్చాక కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలా  వద్దా అనే దానిపై  నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులకు చేసుకుంటుండగా...ప్రభుత్వం  నిర్ణయంపై నేడు ఆర్టీసీ జేఏసీ  ఎలా స్పందిస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: