మాజీ ముఖ్యమంత్రి ప్రియ తనయుడు నారా లోకేష్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. అధికార పార్టీపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో విమర్శలు చేస్తూనే ఉంటాడు. అయితే అతను చేసిన ట్వీట్లు, పోస్టులు తెగ వైరల్ అవుతుంటాయి. ఎందుకంటే అతను చేసే విమర్శలు.. నిజంలేకుండా.. చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. దాంతో నెటిజన్లు పాపం నారా లోకేష్ ని ఆడేసుకుంటారు. ప్రస్తుతం మళ్లీ నారా లోకేష్ పప్పులో కాలేసి నెటిజన్ల ట్రోలింగ్ కు గురిఅవుతున్నాడు.



అదేంటంటే.... జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే పనిలో ఏపీలో ఉల్లిపాయ ధరలు పెరగడానికి కారణం జగన్ మోహన్ రెడ్డియే అంటూ లోకేష్ ట్వీట్‌ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉల్లి విక్రయ కేంద్రాల్లో రేషన్ కార్డు ఉంటే కానీ ఉల్లి ఇవ్వం, ఆధార్ కార్డు ఉంటే కానీ ఉల్లి ఇవ్వం అని అడ్డమైన రూల్స్ పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం దారుణమని లోకేశ్ ట్వీట్ చేశారు.

ఇది చదివిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డల ధరలు పెరిగిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ లో ఉల్లిగడ్డల ధరలు పెరగడానికి జగన్ మోహన్ రెడ్డి ఎలా కారణం అవుతాడంటూ... నెటిజన్లు నారా లోకేష్ చేసిన విమర్శని ఎత్తి పొడుస్తున్నారు.


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కిలో ఉల్లిగడ్డలు కేవలం ఇరవై ఐదు రూపాయలకే లభించే విధంగా జగన్ ప్రభుత్వం చర్యలను చేపట్టింది. కానీ బయట మార్కెట్లలో కేజీ ఉల్లిపాయల ధర 80 రూపాయల వరకు ఉంది. ఏపీ ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిగడ్డలు కేవలం 25 రూపాయలు విక్రయిస్తోంది. ఇరవై ఐదు రూపాయలకే ప్రజలకు విక్రయించడం కొరకు కర్నూలు జిల్లా రైతుల దగ్గర నుంచి 150 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేస్తుంది. ఇలా ప్రతిరోజు వినియోగదారులకు ఉల్లిపాయలను 25 రూపాయలకే విక్రయించడం వల్ల ప్రభుత్వంపై రోజుకి రూ. 40లక్షల భారం పడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: