టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మనదేశం సినిమాతో నటుడిగా చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారు, ఆ తరువాత ఒక్కొక్కటిగా తనకు వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగారు. ఇక తాను నటించే ప్రతి పాత్రలోనూ ఆకట్టుకునే సహజత్వ నటనతో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ నటుడిగా మంచి పేరు సంపాదించి కోట్లాదిమంది అభిమానులను సంపాదించారు ఎన్టీఆర్ గారు. అప్పట్లో రాముడు, కృష్ణుడు వంటి పాత్రల్లో ఆయన నటిస్తున్నపుడు, బహుశా దేవుడు అంటే అలానే ఉంటాడేమో అని ఆ పాత్రలో ఆయనను చూసిన ప్రజలు భావించేవారు. 

 

ఇక ఆ తరువాత సినిమాలకు విరామం పలికి 1982లో సొంతంగా తెలుగుదేశం పేరుతో పార్టీ పెట్టి, అప్పటి ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ముఖ్య మంత్రిగా పీఠాన్ని అధిష్టించారు. అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ రెండింటా తన ప్రతిభతో అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన ఎన్టీఆర్ గారిని ఎప్పటికీ మన తెలుగువారు మరిచిపోలేరు. ఇక అచ్చంగా ఆయన పోలికలతోనే ఇటీవల సినిమాల్లోకి వచ్చిన ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తే చాలు, ఎవరికైనా తాత గుర్తుకు రాక మానరు. బాలనటుడిగా సినిమాల్లోకి రంగప్రవేశం చేసిన జూనియర్ ఎన్టీఆర్, పెరిగి పెద్దయ్యాక నిన్ను చూడాలని అనే సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 

 

ఇక ఆ తరువాత తన టాలెంట్ తో వరుసగా సినిమా అవకాశాలు సంపాదించుకుని నేడు టాలీవుడ్ లోని టాప్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగారు. ఇకపోతే నేడు కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్, సీనియర్ ఎన్టీఆర్ ఫోటోని తీసుకుని, దానిని కాస్త ఎడిట్ చేసి ఆ ఫొటోలో జూనియర్ ఎన్టీఆర్ పిక్ ని సెట్ చేయడం జరిగింది. కొన్నేళ్ల క్రితం అన్నగారు ఎన్నికల ప్రచార సమయంలో దిగిన ఆ ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో జూనియర్ ని చూసిన వారందరూ ముమ్మూర్తులా తాత లానే ఎంతో అందంగా ఉన్నాడని, తప్పకుండా భవిష్యత్తులో జూనియర్ కనుక రాజకీయాల్లోకి వస్తే, తాత గారి వలే దూసుకెళ్లడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: