తెలంగాణా రాష్ట్రంలో ఎన్నడు లేనంతగా అనిశ్చిత స్దితి నెలకొంది.. ఒక ప్రభుత్వ సంస్ద ఇన్ని రోజుల నుండి చేస్తున్న సమ్మెలో పురోగతి కనిపించక పోగా ఇప్పుడు తన ఉనికినే కోల్పోయింది. సమ్మె చేయమని ఎవరు చెప్పారో, సమ్మె విరమించమని ఎవరు చెప్పారో తెలియదు గాని వేయిల మది కార్మికుల బ్రతుకులు బజారుపాలు అవుతాయా? అనే ప్రశ్న ప్రతి వారిలో ఉదయిస్తుంది. ఇప్పుడు సమ్మె విరమించామని జేఏసి నాయకులు ప్రకటించగా ప్రభుత్వం మాత్రం తమకేమి పట్టనట్లుగా ఉంది.

 

 

దీనిపై అధికారులు, నాయకులు తీవ్రమైన చర్చలు కొనసాగిస్తుండగా తెలంగాణ ఆర్టీసీ అంశం మీద ప్రభుత్వ ఆలోచనలను ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కు స్పష్టం చేసారు. ఇప్పుడున్న పరిస్దితుల్లో తెలంగాణ ఆర్టీసీ మోయలేని భారంగా మారిందని అంకెలతో సహా విశ్లేషించారు. ఆర్టీసీకి కావాల్సినంత స్థాయిలో నిధుల సమీకరణ చేసే శక్తి ప్రభుత్వానికి లేదని, అందువల్ల కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని అనుసరించి తాము రూట్ల ప్రైవేటీకరణ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

 

 

ఇదే సమయంలో కార్మికుల విషయంలో  ఏ నిర్ణయాలు తీసుకున్నా.. సామరస్యంగా సమస్యను పరిష్కరించే దిశగా ఉండాలని, ప్రధానంగా కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం. అయితే, ఆర్టీసీ ఎండీ మాత్రం విధుల్లోకి తీసుకోవడం ఇప్పుడు కుదరదని ప్రకటించారు. అయితే, ఆర్టీసీ కాదన్నా..ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ఏం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

 

 

అయితే గవర్నర్ సైతం కార్మికులతో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచన చేయటంతో ఇప్పుడు సీఎం ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్మికులను విధుల్లోకి తీసుకునెందుకు ఒప్పుకుంటారా..లేక ఆర్టీసీ విషయంలో మరేదైన ప్రణాళిక  అమలు చేస్తారా అనే విషయం సృష్టంగా బయటకు రావడం లేదు.. ఇక తెలంగాణ ఆర్టీసీలో ప్రైవేటుకు చోటిస్తూ సంస్థను కొనసాగించే విధంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: