నిజంగా చంద్రబాబునాయుడు అభిమానులకు, ఎల్లోమీడియాకు పెద్ద షాకింగ్ అనే అనుకోవాలి. కేంద్రంలో కానీ దేశంలో ఎక్కడైనా కానీ సంక్షోభం తలెత్తితే వెంటనే అందరికీ గుర్తొచ్చే రాజకీయ నేత, అపర చాణుక్యుడు, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడే కదా ? అలాంటిది మహారాష్ట్రలో ఇంతగా రాజకీయ సంక్షోభం కంటిన్యు అవుతున్నా ఎక్కడా చంద్రబాబు మాటే వినబడటం లేదు.

 

మహారాష్ట్రలోని రాజకీయ పార్టీల ధోరణి చూస్తుంటే అసలు చంద్రబాబును లెక్క చేస్తున్నట్లే లేదు. ఒకవైపు ఎన్సీపి అధ్యక్షుడు శరద్ పవార్, ఇంకోవైపు శివసేన అధినేత ఉత్ధవ్ ఠాక్రే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. అలాగే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి, మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ మాజీ సిఎంకు బాగా కావాల్సిన వారే.

 

ఇలా అందరూ అయినవాళ్ళే అయినా ఎవరూ చంద్రబాబును ఎందుకు పట్టించుకోవటం లేదో ఎవరికీ అర్ధం కావటం లేదు. ప్రస్తుతం మహారాష్ట్రలో ముదిరిపోయిన సంక్షోభం లాంటివి పరిష్కరించటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఎల్లోమీడియా ఊదరగొట్టటానికి అవకాశం లేకుండా పోయింది. పోనీ టిడిపి నేతలన్నా ప్రస్తావిస్తున్నారా అంటే అదీ లేదు.

 

ఎందుకంటే అసలు చంద్రబాబు వేలు పెట్టటానికి కూడా అవకాశం దొరకటం లేదు కదా ? అసలే మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు పరువు సాంతం పాతాళానికి పడిపోయింది. ఎల్లోమీడియా అయితే దాని మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్ధంకాని అయోమయంలో పడిపోయింది.

 

ఈ పరిస్ధితుల్లోనే మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదరటం నిజంగా చంద్రబాబు, ఎల్లోమీడియా దురదృష్టం కాకపోతే మరేమిటి ? చుట్టూ నీళ్ళున్నా తాగటానికి గుక్కెడు నీళ్ళు కూడా పనికిరావన్నట్లు ఎదురుగా సంక్షోభం కనిపిస్తున్నా వేలు పెట్టే అవకాశమే కనబడటం లేదు. అసలు మహారాష్ట్ర సంక్షోభం గురించి కనీసం మాటమాత్రం కూడా చంద్రబాబు ప్రస్తావించలేకపోతున్నారంటేనే ఆయన మానసిక పరిస్ధితి ఎలాగుంటుందో అర్ధం చేసుకోవచ్చు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: