నేడు భారత రాజ్యాంగం 70 దినోత్సవాన్ని పార్లమెంటు హాల్లో ఉభయ సభల సభ్యుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని మోదీ దేశ రాజ్యాంగం గురించి రాజ్యాంగ గొప్పతనం గురించి వివరించారు. భారత రాజ్యాంగం చాలా గొప్పదని భారతీయులందరూ భారత రాజ్యాంగాన్ని పవిత్ర గ్రందంగా  భావిస్తారు అని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత దేశ పౌరులందరికీ ఉందని సూచించారు. అంతేకాకుండా రాజ్యసభ 150వ భేటీకి గుర్తుగా 250 రూపాయల నాణాన్ని ఆవిష్కరించారు. రాజ్యసభ 250 బేటీ లను విజయవంతంగా పూర్తి చేసుకోవడం గౌరవ కారణమని ఆయన తెలిపారు. 

 


 రాజ్యసభ 150 రోజులకు గుర్తుగా 250 రూపాయల నాణాన్ని నేడు 70వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని ఆవిష్కరించారు.కాగా  1952 మే 13న రాజ్యసభ మొదటి భేటీ జరిగింది. మొత్తంగా 250 భేటీలు  పూర్తయ్యేసరికి 5466 గంటలు పనిదినాలు  పూర్తిచేసుకుంది రాజ్యసభ. మొత్తంగా 67 సంవత్సరాల రాజ్యసభ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఎన్నో నూతన చట్టాలను రూపొందించింది రాజ్యసభ. మొత్తం రాజ్యసభలో 3817 బిల్లుకు ఆమోద ముద్ర వేసింది రాజ్యసభ. ఇటీవలే రాజ్యసభ 250 భేటీ సందర్భంగా రాజ్యసభ యొక్క గొప్పతనాన్ని రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వివరించిన విషయం తెలిసిందే. 

 


 కాగా  రాజ్యసభ 250 భేటీ సందర్భంగా 250 రూపాయల వెండి నాణేన్ని  నేడు 70వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ విడుదల చేశారు. అంతేకాకుండా ఈ సందర్భంగా ఐదు రూపాయల రెవిన్యూ స్టాంప్ ను కూడా విడుదల చేశారు. అయితే 70 వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ వెంకయ్య నాయుడు రాజ్యాంగ  గొప్పతనాన్ని గురుంచి చరిత్రను గురుంచి ఉభయ సభ  సభ్యులకు  సభలో వినిపించారు. 1949 నవంబరు 26 న భారత రాజ్యాంగ ఆమోద ముద్ర వేసుకున్నదని  తెలిపారు ప్రధాని మోదీ . అదే నవంబరు 26న ముంబైలో దాడులు జరగడం చాలా బాధాకరమైన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: