ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ కి అసెంబ్లీ లో మరియు పబ్లిక్ సమావేశాలలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు చుక్కలు చూపిస్తున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే లు మరియు టీడీపీ సభ్యులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ  ఇంగ్లీష్ మీడియంలో బోధన విధానానికి కొందరి సానుకూలంగా  ఉన్న  కానీ కొందరు  ప్రతిపక్ష పార్టీ నాయకులు మాత్రం  తెలుగు మీడియంలో బోధన విధానాన్ని తీసివేయడం, తెలుగు భాషను ప్రమాదంలో పడేయడమే అన్న ఉద్దేశంతో ఆందోళన చేస్తున్నారు కానీ  సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం తన వైఖరిని మార్చుకోలేదు. అయితే తాజాగా సీఎం జగన్ పాఠశాల విద్యార్థులకు ఒకటో తరగతి నుండే ఇంగ్లీష్ బోధనను తీసుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే అయితే  తెలుగులో బోధన తీసివేయడం సమంజసం కాదు అని రాష్ట్రమంతా వ్యతిరేక శబ్దాలు వినిపిస్తున్న తరుణం లో చంద్రబాబు నాయుడు  ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇరుకున పెట్టడానికి  రంగంలోకి దింపబోతున్నారు అని సమాచారం. ఎవరూ ఊహించని విధంగా బాలయ్య జగన్ ను ఇబ్బంది పెట్టె  అంశం సీఎం  తీసుకున్న తెలుగు మీడియం తీసివేత నిర్ణయం.  ప్రతిపక్షపార్టీలు దుమ్మెత్తి పోసిన  అధికారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలపై తిరిగి మాటల దాడి చేస్తుంది తప్ప, తెలుగు మీడియం తీసివేత నిర్ణయాన్ని మాత్రం ఉపసంహరించుకోలేదు అని ఈ అంశం అయితే అసెంబ్లీ లో జగన్ ను ఇబ్బంది పెట్టడానికి  బాగుంటుంది అని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. అయితే తెలుగు భాష అంటే ఎక్కువ మక్కువ చూపే బాలయ్య భాషకు సంప్రదాయాలకు ఎక్కువగా  ప్రాధాన్యత ఇస్తారు అని  వాటి గొప్పతనాన్ని బాలయ్య చాలా బాగా  చెప్పగలరు అని  బాలయ్య అయితేనే అందుకు  సరిగ్గా సరిపోతాడని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భావిస్తున్నట్లు సమాచారంఅయితే   చంద్రబాబు బాలయ్య ను రంగంలోకి దించి జగన్ ను ఇబ్బంది పెట్టాలని, తెలుగు మీడియం విషయంలో అసెంబ్లీ వేదికగా టిడిపి గొంతుకను  వినిపించాలని వారిని తన మాటలతో ఇరుకున పెట్టె ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.మరి రాబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో బాలయ్య ఎలా అధికారపక్షాన్ని ఏ విదంగా ఇబ్బంది పెడతారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: